Share News

ప్రశాంత ఎన్నికలకు సహకరించండి

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:29 AM

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు సహకరించాలని పార్లమెంటరీ నియోజకవర్గ సాధారణ పరిశీలకుడు ప్రమోద్‌కుమార్‌ మెహర్డ కోరారు.

 ప్రశాంత ఎన్నికలకు సహకరించండి
సమావేశంలో మాట్లాడుతున్న పరిశీలకుడు ప్రమోద్‌కుమార్‌, కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

పార్వతీపురం, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు సహకరించాలని పార్లమెంటరీ నియోజకవర్గ సాధారణ పరిశీలకుడు ప్రమోద్‌కుమార్‌ మెహర్డ కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేట్‌ ప్రదేశాల్లో ఎన్నికల ప్రచార రాతలు ఉండరాదన్నారు. ప్రచారంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, నియ మావళిని పక్కాగా పాటించాలని సూచించారు. కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రచారానికి ముందస్తు అనుమతి తప్పనిసరి అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో భౌగోళిక పరిస్థితుల నేపఽథ్యంలో పాడేరు, అరకు, రంపచోడవరంలోనే అనుమతులు పొందడానికి అవకాశం కల్పించామని తెలిపారు. సువిధ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశాలు లేనప్పడు వాట్సాప్‌ , ఫ్యాక్స్‌ రూపంలో కూడా దరఖాస్తులు ఇవ్వొచ్చన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో వివిధ పరిస్థితుల దృష్ట్యా పోలింగ్‌ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే జరుగుతుందని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారం మే 11వ తేదీ సాయంత్రం నాలుగు గంటలతో ముగుస్తుందన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల పరిధిలో పోలింగ్‌ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు, పార్వతీపురం నియోకవర్గంలో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని వెల్లడించారు.

Updated Date - Apr 30 , 2024 | 12:29 AM