నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యం
ABN , Publish Date - Jun 17 , 2024 | 12:09 AM
పార్వతీపురం నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను నియోజకవర్గ పరిధిలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అదే విధంగా వివిధ శాఖల అధికారులు, వీఆర్వోల సంఘ నాయకులు, గ్రామ కార్యదర్శుల సంఘాల నాయకు లు ఆదివారం అభినందించారు.

పార్వతీపురం, ఆంధ్రజ్యోతి: పార్వతీపురం నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను నియోజకవర్గ పరిధిలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అదే విధంగా వివిధ శాఖల అధికారులు, వీఆర్వోల సంఘ నాయకులు, గ్రామ కార్యదర్శుల సంఘాల నాయకు లు ఆదివారం అభినందించారు. ఈసందర్భంగా విజయచంద్ర మాట్లాడుతూ తన విజయం కోసం కష్టపడిన కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తా నన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బార్నాల సీతారాం, బోను దేవిచం ద్రమౌళి, గొట్టాపు వెంకటనాయుడు, రౌతు వేణు, కందకూరి ప్రభాకరరావు, జి.రవికుమార్, పాలకొండ రాజశేఖర్, మండల ఫకీరు, మండల తాతబాబు, జనసేన నాయకుడు చందక అనీల్ తదితరులు పాల్గొన్నారు.