మంత్రికి అభినందనల వెల్లువ
ABN , Publish Date - Jun 17 , 2024 | 12:08 AM
రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి ఆదివారం సాలూరులోని తన నివాసం వద్ద పలువురు అభినందనలు తెలిపారు.

సాలూరు రూరల్: రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి ఆదివారం సాలూరులోని తన నివాసం వద్ద పలువురు అభినందనలు తెలిపారు. బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు, పార్వతీపురం ఐటీడీఏ పీవో సి.విష్ణుచరణ్, ఎంఈవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సామల సింహాచలం, జిల్లా అధ్యక్షుడు పల్లి జోగారావు, ఆప్టా, పీఆర్టీయూ నాయకులు గణపతి, గున్నరాజు, అధికారులు పెద్దసంఖ్యలో వచ్చి అభినందనలు తెలిపారు. జీవో నెంబరు 117 రద్దు చేయించడానికి కృషి చేయాలని మంత్రి సంధ్యారాణిని ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడు అల్లాడి గణపతి కోరారు. ఆయనతో పాటు పలువురు ఉపాధ్యాయులు ఆమెకు శుభాక్షాంక్షలు తెలిపారు.
11వ వార్డులో భోజనాలు
సాలూరు: పట్టణంలో 11వ వార్డులో ఎమ్మెల్యేగా గుమ్మిడి సంధ్యా రాణి విజయం సాధించటంతో వార్డుకు చెందిన నాయకురాలు బొంగ బాలమ్మ సుమారు 1500 మందికి భోజనాలు పెట్టించారు. సంధ్యారాణి ఘన విజయం సాధించటంతో పాటు మంత్రిగా పదవి వరించటం చాలా ఆనందంగా ఉందన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న సంధ్యారాణిని మాజీ మంత్రి పడాల అరుణ ఆదివారం ఆమె నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
జీవో నెం.117 రద్దుకు కృషి చేయాలి
పార్వతీపురం, ఆంధ్రజ్యోతి: మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి పీఆర్టీయూ పార్వతీపురం మన్యం జిల్లా శాఖ తరపున ఆదివారం అభినందనలు తెలిపారు. సాలూరులో మంత్రి స్వగృహంలో పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు అమరపు సూర్యనారాయణ ఆఽధ్వర్యంలో పుష్పగుచ్ఛం అందించారు. జీవో నెం.117రద్దుకు కృషి చేసి విద్యావ్యవస్థ బాగుకు కారకులు కావాలన్నారు. నూతన వేతన సవరణ కోసం మొదటి క్యాబినెట్‌లో ముఖ్యమంత్రి ద్వారా తీపి కబురు అందించాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర కార్యదర్శి జక్కు రామినాయుడు, గున్న రాజు, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు భోగి రవికుమార్, మొయిద కృష్ణారావు, ఐటీడీఏ విభాగం కన్వీనర్ సాకేటి దాలయ్య, లక్షుంనాయుడు, అప్పారావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.