Share News

పేదల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాం: జగదీశ్వరి

ABN , Publish Date - May 12 , 2024 | 12:16 AM

గిరిజనుల అభివృద్ధికి, పేదల అభ్యున్నతికి టీడీపీ కట్టుబడి ఉందని కూటమి కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థి తోయక జగదీశ్వరి అన్నారు.

పేదల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాం: జగదీశ్వరి

గుమ్మలక్ష్మీపురం: గిరిజనుల అభివృద్ధికి, పేదల అభ్యున్నతికి టీడీపీ కట్టుబడి ఉందని కూటమి కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థి తోయక జగదీశ్వరి అన్నారు. మండలంలోని ఎల్విన్‌పేట గ్రామంలో ఆమె శనివారం ఇంటింటా ప్రచారం చేపట్టారు. సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి, తన ను ఎమ్మెల్యేగా గెలిపించా లని అభ్యర్థించారు. జీవో నెంబర్‌-3ను పునరుద్దరిస్తామని చెప్పారు. మారుమూల గిరిజన గ్రామాల్లో పక్కా ఇళ్లు నిర్మిస్తామని, రహదారులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. పూర్ణపాడు-లాభేసు వంతెన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని, ఒట్టిగెడ్డ సాగునీటి పథకాన్ని నిర్మిస్తామని ఆమె హామీ ఇచ్చారు. యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ద్వారా గిరిజన యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పనా చర్యలు తీసుకుంటానన్నారు. ఈ ప్రచారంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వీరేష్‌ చంద్రదేవ్‌, పార్టీ నాయకులు సుధ, బిడ్డిక పద్మ తదితరులు పాల్గొన్నారు.

గరుగుబిల్లి: కూటమి కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థి తోయక జగదీశ్వరి, అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతను గెలిపించాల ని కోరుతూ ఎంపీటీసీ సభ్యుడు కోట భరత్‌కుమార్‌, పార్టీ ప్రతినిధి ఆర్నిపల్లి గంగాధర్‌నాయుడు శనివారం రావివలసలో ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థికి సైకిల్‌ గుర్తుపై, ఎంపీ అభ్యర్థికి కమలం గుర్తుపై ఓటు వేయాలని కోరారు. ఎంపీటీసీ సభ్యుడు ద్వారపురెడ్డి సత్యనారాయణ , మాజీ ఎంపీపీ గౌరమ్మలు దత్తివలస, కారివలస, చిలకాం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.

గుమ్మలక్ష్మీపురం: మండలంలోని మారుమూల గిరిజన ప్రాంతాలైన వంగర, కేసర, డోలుకోన, కీసరగూడ రెల్లమల్లుగోడ తదితర గిరిజన ప్రాంతాల్లో కూటమి అభ్యర్థుల కోసం ప్రచారం చేశారు. బీజేపీ నాయకుడు సింహాచలం మాట్లాడుతూ కురుపాం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వరిని, అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో కురుపాం నియోజకవర్గ టీడీపీ ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు సోనాలి రామారావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - May 12 , 2024 | 12:16 AM