Share News

చినశంబర పోలమాంబ జాతర లేనట్లే

ABN , Publish Date - Jan 21 , 2024 | 12:01 AM

మరుపెంట గ్రామంలో నిర్వహిస్తున్న చినశంబర పోలమాంబ జాతరను నిర్వహించేందుకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఇకపై శాశ్వ తంగా విరమించుకోవాలగ్రామస్థులందరూ ఏకగ్రీవం గా నిర్ణయించారని ఎంపీపీ ఉరిటి రామారావు, సర్పంచ్‌ ఉరిటి నిర్మళ వెల్లడించారు.

చినశంబర పోలమాంబ జాతర లేనట్లే

గరుగుబిల్లి: మరుపెంట గ్రామంలో నిర్వహిస్తున్న చినశంబర పోలమాంబ జాతరను నిర్వహించేందుకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఇకపై శాశ్వ తంగా విరమించుకోవాలగ్రామస్థులందరూ ఏకగ్రీవం గా నిర్ణయించారని ఎంపీపీ ఉరిటి రామారావు, సర్పంచ్‌ ఉరిటి నిర్మళ వెల్లడించారు. శనివారం వీరు స్థానిక విలేకర్లతో మాట్లాడారు. మక్కువ మండలం శంబర గ్రామంలో పోలమాంబ జాతర నిర్వహించిన తేదీల్లో మరుపెంట గ్రామంలో చినశంబర పోలమాంబ జాతర ప్రతి ఏడాది నిర్వహించడం జరుగుతూ ఉండే దన్నారు. అయితే కరోనా వచ్చినప్పటి నుంచి చిన శంబర పోలమాంబ జాతరను నిర్వహించలేదన్నారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితుల కారణంగా పండగను నిర్వహించేందుకు అనుకూలంగా లేకపోవడంతో పండుగను ఇకపై విరమించుకోవాలని గ్రామస్థులంతా నిర్ణయం తీసుకున్నామని ఎంపీపీ రామారావు, సర్పంచ్‌ నిర్మళ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని స్థానిక ఎస్‌ఐకి తెలియజేశామని తెలిపారు.

Updated Date - Jan 21 , 2024 | 12:01 AM