Share News

పిల్లలకు నైతిక విలువలు నేర్పించాలి

ABN , Publish Date - Nov 13 , 2024 | 11:49 PM

కౌమార దశ నుంచే పిల్లలకు నైతిక విలువలు నేర్పించాలని, సోషల్‌ మీడియా వల్ల కలిగే నష్టాలను యువతకు అర్థమయ్యేలా వ్యవహరించాలని కలెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో సఖి కార్నర్‌ను ప్రారంభించారు.

పిల్లలకు నైతిక విలువలు నేర్పించాలి
నితీష్‌రాజ్‌కు జ్ఞాపిక అందజేస్తున్న కలెక్టర్‌ అంబేడ్కర్‌

పిల్లలకు నైతిక విలువలు నేర్పించాలి పిల్లలకు నైతిక విలువలు నేర్పించాలి

కలెక్టర్‌ అంబేడ్కర్‌

కలెక్టరేట్‌లో సఖీ కార్నర్‌ ప్రారంభం

విజయనగరం దాసన్నపేట, నవంబరు 13: (ఆంధ్రజ్యోతి): కౌమార దశ నుంచే పిల్లలకు నైతిక విలువలు నేర్పించాలని, సోషల్‌ మీడియా వల్ల కలిగే నష్టాలను యువతకు అర్థమయ్యేలా వ్యవహరించాలని కలెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో సఖి కార్నర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అన్ని రెసిడెన్షియల్‌ స్కూల్స్‌, వసతిగృహాల్లో సఖి బృందాలను ఏర్పాటు చేసి ఇతరుల పట్ల మర్యాదగా ఉండడం, డ్రగ్స్‌కి దూరంగా వుండడం, ప్రకృతిని ప్రేమించడం వంటి వాటిపై అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి (జిల్లా కలెక్టరుగా 2022లో పనిచేసిన) సూర్యకుమారి ప్రారంభించిన సఖీ కార్యక్రమాన్ని జిల్లాలో కొనసాగిస్తామని, త్వరలో అన్ని శాఖలతో సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా పర్చువల్‌ కార్యక్రమంలో రాష్ట్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి మాట్లాడుతూ, 2022లో తాను ప్రారంభించిన సఖీ నేడు మంచి ఫలితాలు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాలను జిల్లాలోనే కాకుండా రాష్ట్రమంతటా కొనసాగించాలన్నారు.

- విజయనగరం ఉల్లివీధికి చెందిన రాయప్ప నీతిష్‌రాజ్‌ యాదవ్‌ జాతీయ స్థాయిలో డ్యాన్స్‌, అండ్‌ మోడలింగ్‌లో అవార్డు సాధించినందుకు కలెక్టర్‌ అభినందించారు. కార్యక్రమంలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్మన్‌ కేసలి అప్పారావు, సీడబ్ల్యూసీ చైర్మన్‌ హిమబిందు, ఐసీడీఎస్‌ పీడీ శాంతకుమారి, డీఎంహెచ్‌ఓ డాక్టరు రాణి, నేచర్‌ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2024 | 11:49 PM