Share News

బొబ్బిలిలో హర్షాతిరేకాలు

ABN , Publish Date - Feb 25 , 2024 | 12:19 AM

నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా ఆర్‌వీఎస్‌కేకే రంగారావు (బేబీనాయన) పేరును పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించ డంతో శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

బొబ్బిలిలో హర్షాతిరేకాలు

బొబ్బిలి: నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా ఆర్‌వీఎస్‌కేకే రంగారావు (బేబీనాయన) పేరును పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించ డంతో శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనపై పోటీ చేసే ప్రత్యర్థి ఎవరైనా సరే బేబీనాయన గెలుపు నల్లేరుపై నడకేనని పార్టీ నాయకులు, అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. బేబీనాయన పూర్తి పేరు రావు వెంకట శ్వేతకృష్ణకుమార్‌ రంగారావు. ఆయనకు భార్య రావు శిల్ప, కుమార్తె రావు మేథ జాహ్నవి ఉన్నారు. బేబీనాయన బొబ్బిలి మునిసిపల్‌ చైర్మన్‌గా పని చేశారు. రెండేళ్ల నుంచి బొబ్బిలి పట్టణంలో, రామభద్రపురం మండల కేంద్రంలో అన్న క్యాంటీన్‌ను నిర్వహిస్తున్నారు.

Updated Date - Feb 25 , 2024 | 12:19 AM