Share News

హైదరాబాద్‌లో చీపురుపల్లి యువకుడి దుర్మరణం

ABN , Publish Date - Jul 29 , 2024 | 12:18 AM

చీపురుపల్లి పట్టణానికి చెందిన యు వకుడు హైద్రాబాద్‌లో మృతి చెందాడు. దీనికి సంబంధించిన వివ రాలు ఇలా ఉన్నాయి. చీపురుపల్లి బజారువీధికి చెందిన కిల్లంశెట్టి గో వింద్‌, నాగరత్నంలకు ముగ్గురు కుమారులు.

హైదరాబాద్‌లో చీపురుపల్లి యువకుడి దుర్మరణం

చీపురుపల్లి, జులై 28: చీపురుపల్లి పట్టణానికి చెందిన యు వకుడు హైద్రాబాద్‌లో మృతి చెందాడు. దీనికి సంబంధించిన వివ రాలు ఇలా ఉన్నాయి. చీపురుపల్లి బజారువీధికి చెందిన కిల్లంశెట్టి గో వింద్‌, నాగరత్నంలకు ముగ్గురు కుమారులు. వీరిలో రెండో కుమారు డైన కిల్లంశెట్టి మహేష్‌(29) హైదరాబాద్‌లో ఉంటూ ఓ ప్రైవేటు ఏజె న్సీలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 25న విధి నిర్వహ ణలో ఉండగా మహేష్‌ను కారు ఢీకొంది. అయితే, బయటికి కనిపించే గాయాలేవీ లేకపోవడంతో ఆయన తన రూమ్‌కి వెళ్లిపోయారు. కొంత సమయానికి స్పృహ తప్పి పడిపోవడంతో స్థానికులు చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి ఆయన మరణించారు. రోడ్డు ప్రమాదంలో ఆయన తల కు బలమైన గాయమై ఉంటుందని తలిదండ్రులు అనుమానిస్తున్నారు.

Updated Date - Jul 29 , 2024 | 12:18 AM