Share News

చెక్‌పోస్టులు సమర్థంగా పనిచేయాలి

ABN , Publish Date - Jan 11 , 2024 | 11:38 PM

జిల్లాలో ఉన్న చెక్‌పోస్టులు సమర్థవంతంగా పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఆదేశించారు.

చెక్‌పోస్టులు సమర్థంగా పనిచేయాలి

పార్వతీపురం, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉన్న చెక్‌పోస్టులు సమర్థవంతంగా పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పోలింగ్‌ కేంద్రాల్లో మౌళిక సదుపాయాలు, ప్రాధాన్య భవనాలు, సురక్ష తదితర అంశాలపై సమీక్షించారు. ఎన్నికల నేపథ్యంలో వాటి పనితీరుపై దృష్టసారించాలని, తాగునీరు, ఇతర సౌకర్యాల లభ్యతను పరిశీలించాలని సూచించారు. అనంతరం కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ మాట్లాడుతూ.. పోలింగ్‌ కేంద్రాల వద్ద సౌకర్యాల కల్పనకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. 201 కేంద్రాల్లో ర్యాంప్‌లు, మరుగుదొడ్లు అవసరమని తెలిపారు. ఈ నెల 25 నాటికి మిగిలిన పనులు పూర్తిచేస్తామని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ గోవిందరావు, డీఎంహెచ్‌వో జగన్నాథరావు, డ్వామా పీడీ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2024 | 11:38 PM