Share News

చౌకబారు విమర్శలు చేస్తే సహించేది లేదు

ABN , Publish Date - Mar 06 , 2024 | 12:16 AM

తనపై కొంతమంది వైసీపీ నాయకులు చౌకబారు విమ ర్శలు చేయడం తగదని, దీని వెనుక కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ఉన్నట్లు అనిపిస్తోందని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర బీజేపీ కోర్‌ కమిటీ సభ్యులు నిమ్మక జయ రాజు అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారులను భయపెట్టి అర్నాడ గ్రామానికి రోడ్డు వేయకుండా చేస్తున్నానని కొందరు వైసీపీ నాయకులు వాట్సాప్‌లో ట్రోలింగ్‌ చేయడంపై తీవ్రంగా మండిపడ్డారు. కేవలం రాజకీయ కక్షతో ఇలాంటి విమర్శలు చేస్తున్నారన్నారు. అర్నాడ గ్రామానికి రోడ్డు మంజూరైందని, శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి దానిని పూర్తి చేసే బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్నామని చెబుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చిస్తున్న నిధులు కేంద్ర ప్రభుత్వానివో ...కాదో ప్రజలకు తెలియజేయాలన్నారు. నిధులిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ పేరును ఎక్కడైనా ప్రస్తావిస్తున్నారా అని ప్రశ్నించారు.

 చౌకబారు విమర్శలు చేస్తే సహించేది లేదు

జియ్యమ్మవలస: తనపై కొంతమంది వైసీపీ నాయకులు చౌకబారు విమ ర్శలు చేయడం తగదని, దీని వెనుక కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ఉన్నట్లు అనిపిస్తోందని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర బీజేపీ కోర్‌ కమిటీ సభ్యులు నిమ్మక జయ రాజు అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారులను భయపెట్టి అర్నాడ గ్రామానికి రోడ్డు వేయకుండా చేస్తున్నానని కొందరు వైసీపీ నాయకులు వాట్సాప్‌లో ట్రోలింగ్‌ చేయడంపై తీవ్రంగా మండిపడ్డారు. కేవలం రాజకీయ కక్షతో ఇలాంటి విమర్శలు చేస్తున్నారన్నారు. అర్నాడ గ్రామానికి రోడ్డు మంజూరైందని, శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి దానిని పూర్తి చేసే బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్నామని చెబుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చిస్తున్న నిధులు కేంద్ర ప్రభుత్వానివో ...కాదో ప్రజలకు తెలియజేయాలన్నారు. నిధులిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ పేరును ఎక్కడైనా ప్రస్తావిస్తున్నారా అని ప్రశ్నించారు.

Updated Date - Mar 06 , 2024 | 12:16 AM