Share News

ఏపీ జేఏసీకి సాలూరు కో చైర్మన్‌ రాజీనామా

ABN , Publish Date - Feb 27 , 2024 | 12:31 AM

ఏపీ జేఏసీ ఉద్యమాన్ని మధ్యలో నీరుగార్చిన అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తీరుపై ఉద్యోగ, ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ఆయన తీరుకు నిరసనగా ఏపీ జేఏసీ సాలూరు కో చైర్మన్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్టు మీసాల వెంకట గౌరీశంకరరావు తెలిపారు.

ఏపీ జేఏసీకి సాలూరు కో చైర్మన్‌ రాజీనామా

సాలూరు రూరల్‌,ఫిబ్రవరి 26: ఏపీ జేఏసీ ఉద్యమాన్ని మధ్యలో నీరుగార్చిన అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తీరుపై ఉద్యోగ, ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ఆయన తీరుకు నిరసనగా ఏపీ జేఏసీ సాలూరు కో చైర్మన్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్టు మీసాల వెంకట గౌరీశంకరరావు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగ,ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల పరిష్కరం కోసం విజయవాడలో ఈ నెల 27న జరగాల్సిన చలో విజయవాడ కార్యక్రమాన్ని ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అర్థాంతరంగా వాయిదా వేయడం తగదన్నారు. బండి తీరును వ్యతిరేకిస్తున్నామన్నారు. కనీసం ఐఆర్‌, డీఏలకు, ఒకటో తేదీన జీతాలకు ప్రభుత్వం సముఖత వ్యక్తం చేయకపోయిన నోట్‌ ఇచ్చారంటూ ఉద్యమాన్ని వాయిదా వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అందుకే తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వివిధ సమస్యలపై ఈ నెల 29న ఏపీటీఎఫ్‌ పాత తాలూకా కేంద్రాల్లో నిర్వహించే ధర్నాకు అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు.

Updated Date - Feb 27 , 2024 | 12:31 AM