Share News

కోడ్‌ కూసినా.. తొలగించరా?

ABN , Publish Date - Mar 22 , 2024 | 12:14 AM

ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చి రోజులు గడుస్తున్నా.. ఇంకా పల్లెల్లో పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. ఎక్కడికక్కడ సీఎం జగన్‌ చిత్రాలు, పేర్లు దర్శనమిస్తున్నాయి. జిల్లాలో వైఎస్‌ఆర్‌ ఉచిత విద్యుత్‌ పథకం కింద వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించారు. మరికొన్ని ప్రాంతాల్లో బిగిస్తున్నట్లు సమాచారం. అయితే సీఎం జగన్‌ చిత్రాలతో కూడిన స్టిక్కర్లతో పాటు వైఎస్‌ఆర్‌ ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పథకం పేరుతో మీటరు బాక్సులు దర్శనమిస్తున్నాయి.

కోడ్‌ కూసినా.. తొలగించరా?
విద్యుత్‌ మీటర్‌పై జగన్‌ చిత్రం ఉన్న దృశ్యం

సర్వేరాళ్ల సంగతేంటో..!

కొమరాడ, మార్చి 21 : ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చి రోజులు గడుస్తున్నా.. ఇంకా పల్లెల్లో పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. ఎక్కడికక్కడ సీఎం జగన్‌ చిత్రాలు, పేర్లు దర్శనమిస్తున్నాయి. జిల్లాలో వైఎస్‌ఆర్‌ ఉచిత విద్యుత్‌ పథకం కింద వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించారు. మరికొన్ని ప్రాంతాల్లో బిగిస్తున్నట్లు సమాచారం. అయితే సీఎం జగన్‌ చిత్రాలతో కూడిన స్టిక్కర్లతో పాటు వైఎస్‌ఆర్‌ ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పథకం పేరుతో మీటరు బాక్సులు దర్శనమిస్తున్నాయి. కొమరాడ మండలంలో పలు చోట్ల పంట పొలాల్లో ఇటుంటి మీటర్లు కనిపిస్తున్నాయి. ఇక పొలాల సరిహద్దులోని సర్వే రాళ్లపై కూడా సీఎం పేరు దర్శనమిస్తోంది. గుణానపురం సచివాలయం పరిధిలోని కూతవేటు దూరంలో ఇవి కనిపిస్తున్నా.. ఇంతవరకు ఎటువంట చర్యలు తీసుకోలేదు. కొమరాడ వెలుగు కార్యాలయ భవన శిలాఫల కంపై ఉన్న నేతల పేర్లు కనిపిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం 48 గంటల్లో వాటికి ముసుగులు వేయాలి లేదా తొలగించాలి. కానీ జిల్లాలో అనేక చోట్ల సర్వే రాళ్లు, విద్యుత్‌ మీటర్లు, తదితర వాటిపై సీఎం జగన్‌ చిత్రాలు, పేర్లు నేటికీ దర్శనమిస్తున్నాయి. తక్షణమే వాటిని తొలగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కొమరాడ మండల టీడీపీ కన్వీనర్‌ శేఖరపాత్రుడు తదితరులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Mar 22 , 2024 | 12:14 AM