Share News

సందడిగా రంజాన్‌

ABN , Publish Date - Apr 12 , 2024 | 12:25 AM

మతసామరస్యానికి ప్రతీకగా చెప్పుకునే రంజాన్‌ పండగను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. ఒకరికొకరు ఈద్‌ముబారక్‌ చెప్పుకున్నారు.

సందడిగా రంజాన్‌
విజయనగరం: మసీద్‌లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు

సందడిగా రంజాన్‌

ఈద్‌ ముబారక్‌ చెప్పుకున్న ముస్లింలు

విజయనగరం(ఆంధ్రజ్యోతి), ఏప్రిల్‌ 11 : మతసామరస్యానికి ప్రతీకగా చెప్పుకునే రంజాన్‌ పండగను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. ఒకరికొకరు ఈద్‌ముబారక్‌ చెప్పుకున్నారు. నెల రోజుల పాటు కఠోర ఉపవాసం పాటించి ప్రత్యేక ప్రార్థనలతో బుధవారం ఉపవాస దీక్షలను విరమించిన విషయం తెలిసిందే. గురువారం రంజాన్‌ పర్వదినాన్ని పురష్కరించుకుని రోజంతా ఆనందోత్సాహాలతో కనిపించారు. నగరంలోని జామియా మసీద్‌, హజరత్‌ ఖాదర్‌బాబా దర్గా, మక్కామసీద్‌లో మత గురువులు ప్రార్థనలు నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్దనున్న ఈద్గాలో భారీ సంఖ్యలో ముస్లింలు ప్రార్థనలు చేశారు.

Updated Date - Apr 12 , 2024 | 12:25 AM