Share News

‘అప్రంటీస్‌’ జీవో కాపీల దహనం

ABN , Publish Date - Feb 13 , 2024 | 12:24 AM

ఉపాధ్యాయ నియామకాల్లో అప్రంటీస్‌ విధానాన్ని ప్రవేశపెడుతూ వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రతులను యూటీఫ్‌ ఆధ్వర్యంలో టీచర్లు దహనం చేశారు. సోమవారం ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డులోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు.

 ‘అప్రంటీస్‌’ జీవో  కాపీల దహనం
జీవో కాఫీలను దహనం చేస్తున్న ఉపాధ్యాయులు

బెలగాం, ఫిబ్రవరి 12 : ఉపాధ్యాయ నియామకాల్లో అప్రంటీస్‌ విధానాన్ని ప్రవేశపెడుతూ వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రతులను యూటీఫ్‌ ఆధ్వర్యంలో టీచర్లు దహనం చేశారు. సోమవారం ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డులోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అప్రంటీస్‌ విధానానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రద్దయిన ఆ విధానాన్ని మళ్లీ తీసుకురావడం తగదన్నారు. ఉపాధ్యాయులను వెట్టిచాకిరిలోకి నెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించారు. విద్యా హక్కు ప్రకారమే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని, వెంటనే అప్రంటీస్‌ విధానం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. చట్టాన్ని ఉల్లంఘించి సర్కారు నియామకాలు చేపడితే ఉద్యమాలకు సిద్ధమవుతామని స్పష్టం చేశారు.

Updated Date - Feb 13 , 2024 | 12:24 AM