Share News

బొత్స కోట బద్దలు

ABN , Publish Date - Jun 05 , 2024 | 12:52 AM

జిల్లా రాజకీయాలను శాసిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ(వైసీపీ) కుటుంబ పాలనకు ఓటర్లు చరమగీతం పాడారు. అన్ని పదవుల్లోనూ తమ కుటుంబీకులే ఉండాలన్న వారి ఆశను శిథిలం చేశారు. చీపురుపల్లిలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ, విశాఖ ఎంపీ టిక్కెట్టుపై పోటీ చేసిన బొత్స సతీమణి ఝాన్సీలక్ష్మి, గజపతినగరం నుంచి పోటీ చేసిన బొత్స అప్పలనరసయ్య, నెల్లిమర్ల నుంచి పోటీ చేసిన బడ్డుకొండ అప్పలనాయుడు, విజయనగరం ఎంపీగా పోటీ చేసిన బెల్లాన చంద్రశేఖర్‌ ఇలా వీరంతా బొత్స కుటుంబ సంబంధీకులే. నేడు వీరంతా ఇంటిబాట పట్టారు.

బొత్స కోట బద్దలు

బొత్స కోట బద్దలు

కుటుంబ సభ్యులంతా ఓటమి

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

జిల్లా రాజకీయాలను శాసిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ(వైసీపీ) కుటుంబ పాలనకు ఓటర్లు చరమగీతం పాడారు. అన్ని పదవుల్లోనూ తమ కుటుంబీకులే ఉండాలన్న వారి ఆశను శిథిలం చేశారు. చీపురుపల్లిలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ, విశాఖ ఎంపీ టిక్కెట్టుపై పోటీ చేసిన బొత్స సతీమణి ఝాన్సీలక్ష్మి, గజపతినగరం నుంచి పోటీ చేసిన బొత్స అప్పలనరసయ్య, నెల్లిమర్ల నుంచి పోటీ చేసిన బడ్డుకొండ అప్పలనాయుడు, విజయనగరం ఎంపీగా పోటీ చేసిన బెల్లాన చంద్రశేఖర్‌ ఇలా వీరంతా బొత్స కుటుంబ సంబంధీకులే. నేడు వీరంతా ఇంటిబాట పట్టారు.

చీపురుపల్లిలో ప్రతికూలం

చీపురుపల్లి : దశాబ్దిన్నర కాలంపాటు చీపురుపల్లిలో కొనసాగిన బొత్స సత్యన్నారాయణ హవాకు బ్రేకులు పడ్డాయి. వైసీపీకి పెట్టని కోటగా మారిన చీపురుపల్లిలో సైకిల్‌ స్పీడుకు ఫ్యాన్‌ రెక్కలు తెగి పడ్డాయి. తెలుగుదేశం కూటమి తరపున పోటీ చేసిన కిమిడి కళావెంకటరావు, బొత్స సత్యనారాయణపై 11639 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. కాగా 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచీ ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటలా ఉండేది. 1983 నుంచి 2004 వరకూ ఆ పార్టీ అభ్యర్థులే వరుస విజయాలు సాధించారు. 2004లో మొదటిసారిగా చీపురుపల్లి నుంచి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున బరిలోకి దిగిన బొత్స సత్యన్నారాయణ గద్దే బాబూరావుపై గెలిచి దేశం హవాకు అడ్డు తగిలారు. 2009లో కూడా ఆయనే ప్రాతినిధ్యం వహించారు. 2014లో ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన కిమిడి మృణాళిని గెలిచారు. అంతలోనే 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీకి దిగిన బొత్స సత్యన్నారాయణ చీపురుపల్లి నియోజకవర్గాన్ని తిరిగి వైసీపీ ఖాతాలో చేర్చారు. కాగా బొత్సపై ఘన విజయం సాధించిన కళావెంకటరావు మొదటి రౌండు తప్ప, మిగిలిన అన్ని రౌండ్లలో ఆధిక్యత కనబరిచారు.

175 వస్తాయన్న బొత్స

విజయనగరం (ఆంధ్రజ్యోతి) : ‘బలవంతులు, బలిసిన వారే చంద్రబాబుకు కావాలి. రాష్ట్ర వ్యాప్తంగా 175 సీట్లు వైసీపీ గెలుస్తుంది. జగనే మళ్లీ సీఎం అవుతారు. జూన్‌ 9న విశాఖలో రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు’ అంటూ రాష్ట్ర మాజీ మంత్రి బొత్స సత్యన్నారాయణ గత నెల 24న విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. చివరికి చీపురుపల్లిలో తాను కూడా ఖంగుతిన్నారు. ప్రత్యర్థి అయిన కళావెంకటరావు చేతిలో 11,527 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

అప్పలనరసయ్యకూ తప్పలేదు

గజపతినగరం : గజతినగరం ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు గెలుపొందిన బొత్స అప్పలనరసయ్యకు కూడా ఓటమి తప్పలేదు. ఇసుక, అవినీతి, భూ కుంభకోణాల్లో పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అన్న బొత్ససత్యన్నారాయణ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి పడాల అరుణపై తొలి విజయం సాధించారు. మళ్లీ 2019లో వైసీపీ గాలిలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాగా నెల్లిమర్ల నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన ప్రస్తుత ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు బొత్సకు వరుసకు తమ్ముడు అవుతాడు. ఈయన కూడా పరాజయం పాలయ్యాడు.

Updated Date - Jun 05 , 2024 | 12:52 AM