Share News

బైండోవర్లు కీలకం

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:11 AM

జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు వీలుగా... అల్లరిమూకలు, పాత నేరస్థులు తదితరులపై పోలీసులు దృష్టి పెట్టారు.

బైండోవర్లు కీలకం

- 14,344 బైండోవర్‌ కేసులు

- 111 మంది రౌడీ షీటర్లు

విజయనగరం క్రైం: జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు వీలుగా... అల్లరిమూకలు, పాత నేరస్థులు తదితరులపై పోలీసులు దృష్టి పెట్టారు. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చింది మొదలు సంబంధిత స్టేషన్‌ ఆఫీసర్ల పర్యవేక్షణలో బైండోవర్‌ కేసుల నమోదు ప్రక్రియను ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 14,344 మందిని బైండోవర్‌ చేశారు. విజయనగరం జిల్లాలో గల ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 33 స్టేషన్‌ల పరిధిలో 14,344 మందిపై బైండోవర్‌ కేసులు నమో దయ్యాయి. పాత నేరస్థులకు సంబంధించి 111 మంది పై రౌడీషీట్లు తెరిచారు. వీరందరికీ ఇప్పటికే పోలీసు స్టేషన్లకు రప్పించి...కౌన్సిలింగ్‌ చేశారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరిం చాలని... ఇబ్బంది కలిగిస్తే అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. విజయనగరం జిల్లాలో 14,344 బైండోవర్‌ కేసులకు సంబంధించి అధికార వైసీపీపై 7,980, టీడీపీ 7,511, జనసేన 526, ఇతరులు 296 మందిపై నమోదు చేశారు. వీరితో పాటు, రౌడీ షీటర్లకు సంబంధించి 111 మందిని గుర్తించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ క్షేత్రస్థాయిలో ఉన్న సచివాలయ పోలీసులతో పాటు, స్థానిక పోలీసులు ఎప్పటికప్పుడు వీరిపై నిఘా ఉంచుతారు. అల్లర్లకు పాల్పడితే వెంటనే వీరిని అదుపులోకి తీసుకుంటారు.

Updated Date - Apr 19 , 2024 | 12:11 AM