Share News

తప్పిన పెను ప్రమాదం

ABN , Publish Date - May 27 , 2024 | 11:48 PM

కొత్తవలస జంక్షన్‌లోని, కొత్తవలస-విశాఖపట్టణం రాహదారిలో సోమవారం పెను ప్రమాదం త్రుటిలో తప్పింది.

తప్పిన పెను ప్రమాదం

కొత్తవలస, మే 27 : కొత్తవలస జంక్షన్‌లోని, కొత్తవలస-విశాఖపట్టణం రాహదారిలో సోమవారం పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. సోమవారం ఉదయం లారీలో భారీ క్రేన్‌ను విశాఖపట్టణం నుంచి కొత్తవలస జంక్షన్‌ వైపు తీసుకుని వస్తుండగా కొత్తవలస జంక్షన్‌లోని దుర్గాదేవి గుడి సమీపానికి వచ్చేసరికి క్రేన్‌ రోడ్డు పక్కనున్న షాపుల్లోకి అదుపు తప్పి వెళ్లిపోయింది. దీంతో మూడు షాపులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఉదయం సమయం కాడంతో షాపులను తెరవకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ప్రమాదంలో సుమారు 6 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని షాపుల యజమానులన్నారు.

Updated Date - May 27 , 2024 | 11:48 PM