Share News

ఉత్తమ బోధన అందించాలి

ABN , Publish Date - May 26 , 2024 | 12:17 AM

విద్యా ర్థులకు ఉత్తమ బోధన అందించాలని జిల్లా విద్యా శాఖాధికారిణి పగడాలమ్మ సూచించారు.

ఉత్తమ బోధన అందించాలి

పాలకొండ: విద్యా ర్థులకు ఉత్తమ బోధన అందించాలని జిల్లా విద్యా శాఖాధికారిణి పగడాలమ్మ సూచించారు. పట్టణంలోని వెంకమ్మపేటలోగల ఎంపీయూపీ స్కూల్‌ను ఆమె శనివారం సంద ర్శించారు. నాడు-నేడు ఫేజ్‌-2 పనులను పరిశీ లించి, సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉందని, విద్యా బోధనలు కూడా అదే స్థాయిలో జరగాలని సూచించారు. పాఠశాల హెచ్‌ఎం జి.పరాంకుశం నాయుడు రెండో విడత నాడు-నేడు ప్రగతిని వివరించారు. నిధులు సరిపోక కొన్ని పనులు మిగిలిపోయాయని ఆమె దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఆమె స్పందిస్తూ ఈ పనుల నిమిత్తం నిధులు కేటాయింపునకు చర్యలు తీసుకుంటానని హామీనిచ్చారు. ఈ పరిశీలనలో ఎంఈవో-2 సోంబాబు, ఉపాధ్యాయులు ఉన్నారు.

నాడు-నేడు పనులు పూర్తి చేయండి

వీరఘట్టం: మండలంలో చేపడుతున్న నాడు-నేడు పనులను పాఠశాలల పునఃపారంభ సమయానికి పూర్తి చేయాలని డీఈవో ఆర్‌.పగడాలమ్మ ఆదేశించా రు. కంబరవలస జడ్పీ ఉన్నత పాఠశాలను ఆమె శనివారం సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో ఆర్‌.ఆనందరావు, సిబ్బంది పాల్గొన్నారు.

విద్యా కానుక పరిశీలన

వీరఘట్టం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో మండలానికి సంబంధించి నిల్వ ఉంచిన విద్యా కానుక సామగ్రిని డీఈవో ఆర్‌.పగ డాలమ్మ శనివారం పరిశీలించారు. అనంతరం సిబ్బందితో సమావేశం నిర్వహించా రు. పాఠశాలలు తెరిచే సమయానికి విద్యార్థులందరికీ పుస్తకాలు, బ్యాగులు, షూలు, యూనిఫారాలు సకాలంలో అందేలా చూడాలని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమం లో ఎంఈవో ఆర్‌.ఆనందరావు, ఎంఆర్‌సీ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2024 | 12:17 AM