Share News

సరుకుల కోసం లబ్ధిదారుల ఆందోళన

ABN , Publish Date - Jan 21 , 2024 | 12:09 AM

రేషన్‌ సరుకులు అందకపోవడంతో పురపాలక సంఘం పరిధిలోని ఆశపువీధికి చెందిన లబ్ధిదారులకు శనివారం ఆందోళన చేపట్టారు. ప్రతినెలా 15లోగా సరుకులు ఎండీఎం నిర్వాహకులు అందజేసేవారు. ఈనెల 20వ తేదీ వచ్చినా సరుకులు నిర్వాహకుడు అందజేయ లేదు.

సరుకుల కోసం లబ్ధిదారుల ఆందోళన

రాజాం: రేషన్‌ సరుకులు అందకపోవడంతో పురపాలక సంఘం పరిధిలోని ఆశపువీధికి చెందిన లబ్ధిదారులకు శనివారం ఆందోళన చేపట్టారు. ప్రతినెలా 15లోగా సరుకులు ఎండీఎం నిర్వాహకులు అందజేసేవారు. ఈనెల 20వ తేదీ వచ్చినా సరుకులు నిర్వాహకుడు అందజేయ లేదు. ప్రభుత్వం మాత్రం సర్వర్‌ సమస్య వల్ల 18వ తేదీ వరకు సరుకులు అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇంతలో రేషన్‌ పంపిణీ చేయడానికి సర్వర్‌ కూడా నిలిపి వేశారు. ఇ క్కడ ఆశపువీధిలో లబ్ధిదారులకు సరుకులు అందజేయలేదు.దీంతో శనివారం ఈ వీధికి చెందిన అన సూయ చిన్నమ్మడు, రాంబాబు, అప్పలనరసమ్మ, తది తరులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన తెలిపారు. కాగా ఎండీయూ నిర్వాహకుడు మద్యం మత్తులో ఉండడంతో 50 కుటుంబాలకు సరుకులు పంపిణీ చేయలేదని, ఎన్నిసార్లు ఫోన్‌చేసినా ఎత్తడంలేదని సంబంధి త డీలర్‌ను ఇంటికి పంపించి ప్రస్తుతం సరుకులు మాన్యు వల్‌గా అందించా లని ఆదేశించామని సీఎస్‌డీటీ చిరంజీవి ఆంధ్రజ్యోతికి తెలిపారు. కొన్ని కు టుంబాలకు సరుకులు అందజేశామని చెప్పారు. ప్రస్తుతం సర్వర్‌ నిలిపివేయ డంతో వచ్చే నెల పంపిణీలో ఈనెల సరుకులు సర్దుబాటు చేస్తామన్నారు.

Updated Date - Jan 22 , 2024 | 07:58 AM