Share News

పైసా ఖర్చు చేయకుండానే ఎమ్మెల్యేగా..

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:20 AM

ఒకప్పటి శ్రీకాకుళం జిల్లా... నేటి విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండ గ్రామానికి చెందిన అడ్డాకుల లక్ష్మునాయుడు పైసా ఖర్చు చేయకుండా 1955లో ఆగూరు ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

పైసా ఖర్చు చేయకుండానే ఎమ్మెల్యేగా..
అడ్డాకుల లక్ష్మునాయుడు

- నిస్వార్థ ప్రజాసేవకు నిదర్శనం అడ్డాకుల లక్ష్మునాయుడు

గుమ్మలక్ష్మీపురం: ఒకప్పటి శ్రీకాకుళం జిల్లా... నేటి విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండ గ్రామానికి చెందిన అడ్డాకుల లక్ష్మునాయుడు పైసా ఖర్చు చేయకుండా 1955లో ఆగూరు ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఇది కురుపాం శాసనసభ నియోజకవర్గంగా మారింది. ఆ తర్వాత ఆయన 1962లో మళ్లీ అదే నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలుపొందారు. నిస్వార్థంగా సేవలు అందించారు. 1904లో పుట్టిన ఆయన 1972లో కన్నుమూశారు. ఆయన కుమారుడు అడ్డాకుల గుండునాయుడు గుమ్మలక్ష్మీపురం మండల అధ్యక్షుడిగా పనిచేశారు. గుండునాయుడు కుమారుడు గంగరాజు, కుమార్తె సర్పంచ్‌లుగా పనిచేశారు. ప్రస్తుత టీడీపీ, జనేసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి తోయక జగదీశ్వరి భర్త సన్యాసినాయుడు ఈ అడ్డాకుల కుటుంబానికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. గిరిజన ప్రాంతంలో ఈ కుటుంబానికి మంచి పేరు ఉంది.

Updated Date - Apr 20 , 2024 | 12:20 AM