Share News

గిరిజన గ్రామాలకు బీటీ రోడ్లు వేయాలి

ABN , Publish Date - Jan 06 , 2024 | 12:09 AM

మండలంలోని గిరిజన గ్రామాలన్నింటికీ బీటీ రోడ్లు వేయాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోరంగి సీతారాం డిమాండ్‌ చేశారు.

గిరిజన గ్రామాలకు బీటీ రోడ్లు వేయాలి

జియ్యమ్మవలస: మండలంలోని గిరిజన గ్రామాలన్నింటికీ బీటీ రోడ్లు వేయాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోరంగి సీతారాం డిమాండ్‌ చేశారు. దీనిపై ఈనెల 9న స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద ధర్నా చేపడతామని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం బిల్లమానుగూడ గిరిజన గ్రామంలో పోస్టర్లు విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వనజ గ్రామానికి బిల్లమానుగూడ రెండు కిలో మీటర్ల దూరం ఉన్నప్పటికీ ఇంతవరకు రోడ్డు సౌకర్యం లేదని తెలిపారు. బీటీ రోడ్డు మంజూరు చేసి వెంటనే నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి బి.మోహనరావు, గిరిజనులు పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2024 | 12:09 AM