వైసీపీ‘కోట’కు బీటలు
ABN , Publish Date - Mar 04 , 2024 | 12:22 AM
ఎన్నికల నోటిఫికేషన్ కొద్దిరోజుల్లో విడుదల కానున్న నేపథ్యంలో రాజకీయ పరిణామాలు తొందరగా మారిపోతున్నాయి. చేరికలు ఊపందుకుంటున్నాయి. నిత్యం అధికార పార్టీ నుంచి టీడీపీలోకి అనేక మంది వచ్చి చేరుతున్నారు. ఎస్.కోటలో మరిన్ని భిన్నమైన ఘటనలు చోటుచేసుకోవడం కొన్నాళ్లుగా చూస్తున్నాం. అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య ఏర్పడిన అగాధం పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా వైసీపీలో మరో కుదుపు రానుంది. ఎమ్మెల్సీ భార్య.. వైస్ ఎంపీపీ సుధారాజు నేతృత్వంలో సర్పంచులు, ఎంపీటీసీలు, కీలక నాయకులు తెలుగుదేశంలో చేరేందుకు మంగళగిరి బయలుదేరినట్లు సమాచారం.
వైసీపీ‘కోట’కు బీటలు
ఎస్.కోట నియోజకవర్గం నుంచి భారీగా
టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం
ఎమ్మెల్సీ భార్య.. వైస్ ఎంపీపీ సుధారాజు
నేతృత్వంలో పయనం
మంగళగిరిలో లోకేష్ ఆధ్వర్యంలో
చేరేందుకే వెళ్లినట్లు సమాచారం
సర్పంచులు.. ఎంపీటీసీలు..
కీలక నాయకులు కూడా
ఎన్నికల నోటిఫికేషన్ కొద్దిరోజుల్లో విడుదల కానున్న నేపథ్యంలో రాజకీయ పరిణామాలు తొందరగా మారిపోతున్నాయి. చేరికలు ఊపందుకుంటున్నాయి. నిత్యం అధికార పార్టీ నుంచి టీడీపీలోకి అనేక మంది వచ్చి చేరుతున్నారు. ఎస్.కోటలో మరిన్ని భిన్నమైన ఘటనలు చోటుచేసుకోవడం కొన్నాళ్లుగా చూస్తున్నాం. అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య ఏర్పడిన అగాధం పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా వైసీపీలో మరో కుదుపు రానుంది. ఎమ్మెల్సీ భార్య.. వైస్ ఎంపీపీ సుధారాజు నేతృత్వంలో సర్పంచులు, ఎంపీటీసీలు, కీలక నాయకులు తెలుగుదేశంలో చేరేందుకు మంగళగిరి బయలుదేరినట్లు సమాచారం.
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగలుతున్నాయి. అన్ని నియోజకవర్గాల్లో కీలక నేతలు టీడీపీ వైపు చూస్తున్నారు. ఐదేళ్లుగా అనేక విధాలా విసిగిపోయి చివరకు పార్టీ మారడమే మంచిదని భావించి తెలుగుదేశం జెండా పడుతున్నారు. అదే దారిలో అధికార పార్టీలో కొంతకాలంగా సంచలనాలకు వేదిక అవుతున్న ఎస్.కోట నియోజకవర్గంలో మరో కీలక పరిణామం జరుగనుంది. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు భార్య, ఎస్.కోట వైస్ ఎంపీపీ సుధారాజు నేతృత్వంలో ఇందుకూరి వర్గం టీడీపీలో చేరేందుకు ఆదివారం బయలుదేరి వెళ్లింది. ఈ పరిణామాన్ని పరిశీలకులు జిల్లా వైసీపీలో, ఎస్.కోట నియోజకవర్గంలో భారీ కుదుపుగానే భావిస్తున్నారు. మంత్రి బొత్స, జడ్పీ చైర్మన్ శ్రీనివాసరావు వర్గంగా భావించే ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు వర్గం ఏకంగా పార్టీని వీడేందుకు తీసుకున్న నిర్ణయం అనేక ఆలోచనలను రేకెత్తిస్తోంది. స్వయానా ఎమ్మెల్సీ భార్య, వైస్ ఎంపీపీగా ఉన్న సుధారాజు నాయకత్వంలోనే ద్వితీయ శ్రేణి నేతలంతా విజయవాడ బయలుదేరి వెళ్లారు. ఎస్.కోట సర్పంచితో సహా సుమారు 25 పంచాయతీల నుంచి 70 మంది నాయకులు మంగళగిరి బయలుదేరారు. లోకేష్ ఆధ్వర్యంలో సోమవారం టీడీపీలో చేరుతారన్న ప్రచారం సాగుతోంది. ఎస్.కోట, వేపాట, ఎల్.కోట, కొత్తవలస, జామి మండలాల నుంచి సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ద్వితీయ శ్రేణి నాయకులు వెళ్లిన వారిలో ఉన్నారు. విచిత్రం ఏమిటంటే ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మాత్రం ఈ టీమ్‌లో లేరు. ఈయన వైసీపీలోనే ఉంటారని, తరువాత జరిగే పరిణామాల బట్టి నిర్ణయం తీసుకుంటారని తెలుసోంది. ఎమ్మెల్సీ తో పాటు కొందరు జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీలు, సర్పంచులు వెళ్లలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు టిక్కెట్టు ఇవ్వవద్దని భారీ స్థాయిలో రఘురాజు వర్గం పోరాటం సాగించింది. నేరుగా బహిరంగ సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు. అయినా ఫలించకపోవడంతోనే కొంత మంది నాయకులు ముందుగా టీడీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
- నిన్నటికి నిన్న విజయనగరం వైసీపీలో పెద్ద కుదుపు వచ్చింది. వైసీపీకి, మంత్రి బొత్స సత్యనారాయణకు ముఖ్య అనుచరులుగా భావించే పిల్లా విజయ్‌కుమార్, అవనాపు విజయ్‌లు టీడీపీలో చేరారు. నిశితంగా పరిశీలిస్తే జిల్లా వ్యాప్తంగా వైసీపీలో విచిత్రమైన ట్రెండ్ నడుస్తోంది. బొబ్బిలి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే శంబంగికి వ్యతిరేక వర్గం ఉంది.
- ఎస్.కోటలో ఇందుకూరి వర్గం తీసుకున్న నిర్ణయంపై బొత్స, జడ్పీ చైర్మన్లు ఎమ్మెల్సీ ఇందు కూరికి ఫోన్ చేసినట్లు సమాచారం. విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీలక్ష్మి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆ పార్లమెంట్ పరిధిలో ఎస్.కో ట నియోజకవర్గం ఉండడంతో వైసీపీని వీడి వెళ్లవద్దని రఘురాజును కోరినట్లు తెలుస్తోంది. అయితే సుధారాజు మాత్రం తన అనుచరులతో మంగళగిరికి బయలుదేరి వెళ్లారు.
--------------