తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Oct 21 , 2024 | 12:19 AM
జిల్లాలో ఈనెల 23వ తేదీ నుంచి 26 వరకు తుఫాన్ వల్ల వర్షాలు కురిసే అవకాశం ఉం డడంతో జిల్లాయంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టరు ఎ.శ్యామ్‌ప్రసాద్ కోరారు.
పార్వతీపురం, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈనెల 23వ తేదీ నుంచి 26 వరకు తుఫాన్ వల్ల వర్షాలు కురిసే అవకాశం ఉం డడంతో జిల్లాయంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టరు ఎ.శ్యామ్‌ప్రసాద్ కోరారు. ఈ మేరకు ఆదివారం జిల్లా, మండల స్థాయి అధికారులతో కలెక్టరు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ వసతి గృహాలను తనిఖీ చేయాలని కోరారు. శిథిలావస్థకు చేరిన భవనాల్లో ఎవరూ ఉండకుండా చర్యలు చేపట్టా లని తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలకు హెచ్చరించాలన్నారు. తుఫా న్ గురించి అన్ని శాఖలు ప్రజలకు అప్రమత్తం చేయాలని తెలి పారు. శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని కోరారు.