Share News

భక్తి శ్రద్ధలతో బక్రీద్‌

ABN , Publish Date - Jun 17 , 2024 | 11:42 PM

భక్తి, త్యాగం, సహనం, దాతృత్వం తదితర సుగుణాలకు ప్రతీకగా నిలిచే బక్రీద్‌ను జిల్లా వ్యాప్తంగా ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈద్గాల్లో సోమవారం సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. మత పెద్దలు అల్లాకు ప్రత్యేక ప్రార్థనలు చేయించారు.

భక్తి శ్రద్ధలతో బక్రీద్‌
విజయనగరం: ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు

భక్తి శ్రద్ధలతో బక్రీద్‌

ఈద్గాల్లో సామూహిక ప్రార్థనలు

విజయనగరం(ఆంధ్రజ్యోతి), జూన్‌ 17 : భక్తి, త్యాగం, సహనం, దాతృత్వం తదితర సుగుణాలకు ప్రతీకగా నిలిచే బక్రీద్‌ను జిల్లా వ్యాప్తంగా ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈద్గాల్లో సోమవారం సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. మత పెద్దలు అల్లాకు ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. ప్రవక్త హజరత్‌ ఇబ్రహీం త్యాగానికి ప్రతీకగా బక్రీద్‌ జరుపుకుంటారు. అల్లాపై విశ్వాసంతో జీవిస్తే అంతా మంచే జరుగుతుందని మత పెద్దలు చెప్పారు. నగరంలోని జామియా మసీద్‌, చోటి, దక్నీ దర్గాలు, మెమోము మసీదు, బాబామెట్టలోని హజరత్‌ ఖాదర్‌బాబా దర్గాతో పాటు బొబ్బిలి, నెల్లిమర్ల గజపతినగరం, రాజాం, ఎస్‌.కోట తదితర ప్రాంతాల్లోనూ బక్రీద్‌ను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లింలంతా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

Updated Date - Jun 17 , 2024 | 11:42 PM