Share News

భక్తిశ్రద్ధలతో బక్రీద్‌

ABN , Publish Date - Jun 17 , 2024 | 11:30 PM

జిల్లాలో ముస్లిం సోదరులు సోమవారం భక్తిశ్రద్ధలతో బక్రీద్‌ జరుపుకున్నారు. తెల్లవారుజామునే మసీదులకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మత గురువులు తమ సందేశాన్ని చదివి వినిపించారు.

భక్తిశ్రద్ధలతో బక్రీద్‌
పార్వతీపురంలో ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు

జిల్లాలో ముస్లిం సోదరులు సోమవారం భక్తిశ్రద్ధలతో బక్రీద్‌ జరుపుకున్నారు. తెల్లవారుజామునే మసీదులకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మత గురువులు తమ సందేశాన్ని చదివి వినిపించారు. త్యాగానికి ప్రతీక బక్రీద్‌ అని తెలిపారు. అల్లా చెప్పిన విధంగా ప్రతిఒక్కరూ స్నేహభావంతో మెలిగి.. శాంతి సామరస్యతో తోటివారికి సహాయపడాలని సూచించారు. దయతో ఉంటూ దానఽధర్మాలు చేస్తూ ఆదర్శంగా నిలవాలని, ఇస్లాం ప్రకారం నడుచుకోవాలని తెలిపారు. పక్కవారి సుఖమయ జీవనానికి చేతనైన సాయమందించాలని కోరారు. జిల్లాలోని కురుపాం, పార్వతీపురం, సాలూరులోని జామియా మసీదుల్లో ముస్లింలు నమాజ్‌లు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. మత గురువుల ఆధ్వర్యంలో ప్రార్థనలు చేశారు.

- పార్వతీపురం టౌన్‌ /కురుపాం/సాలూరు రూరల్‌

Updated Date - Jun 17 , 2024 | 11:30 PM