Share News

బాబు ప్రమాణ స్వీకారానికి శ్రేణుల పయనం

ABN , Publish Date - Jun 09 , 2024 | 11:04 PM

రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈనెల 12న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో శరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి.

బాబు ప్రమాణ స్వీకారానికి శ్రేణుల పయనం

పార్వతీపురం, జూన్‌9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈనెల 12న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో శరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం ముఖ్యమంత్రిగా చంద్రబాబు బుధవారం ఉదయం 11.27 గంటలకే ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి పెద్దఎత్తున పయనమయ్యేందుకు తెలుగు తమ్ముళ్లు సిద్ధమవుతున్నారు. జనసేన, బీజేపీ నాయకులు కూడా బయల్దేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు విజయవాడ చేరుకున్నారు.

Updated Date - Jun 09 , 2024 | 11:04 PM