Share News

ఓటుపై చైతన్యం

ABN , Publish Date - Apr 07 , 2024 | 12:18 AM

ఓటు విలువైనదని... ప్రతి ఒక్కరూ వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ డ్వాక్రా మహిళలు ప్రజల్లో చైతన్యం నింపేందుకు విశేషంగా ముందుకొచ్చారు.

ఓటుపై చైతన్యం
ఓట్‌ పదంలో వరుసగా నిల్చొన్న మహిళా సంఘాల సభ్యులు

ఓటుపై చైతన్యం

కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 6: ఓటు విలువైనదని... ప్రతి ఒక్కరూ వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ డ్వాక్రా మహిళలు ప్రజల్లో చైతన్యం నింపేందుకు విశేషంగా ముందుకొచ్చారు. స్వీప్‌ కార్యక్రమంలో భాగంగా నగరంలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక గాంధీ విగ్రహం నుంచి కన్యకాపరమేశ్వరి ఆలయం, గంటస్తంభం మీదుగా రాజీవ్‌ క్రీడా మైదానం వరకూ ర్యాలీ సాగింది. అనంతరం ఓట్‌ అన్న అక్షరాలలో మానవహారం నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి జేసీ కార్తీక్‌ మాట్లాడుతూ ఈనెల 13వ తేదీ వరకూ స్వీప్‌ కార్యక్రమాలు వివిధ రూపాల్లో కొనసాగిస్తామని చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, ఎన్నికల్లో మహిళలంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ మల్లయ్యనాయుడు, సహాయ కమిషనర్‌ తిరుమలరావు, మెప్మా పీడీ సుధాకరరావులు పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2024 | 12:18 AM