కక్ష సాధింపు మానుకోవాలి
ABN , Publish Date - Jul 08 , 2024 | 11:52 PM
చిరుద్యోగస్థులు, ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లపై కక్ష సాధిం పులు మానుకోవాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మథ డిమాండ్ చేశారు.

పార్వతీపురంటౌన్: చిరుద్యోగస్థులు, ఉపాఽధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లపై కక్ష సాధిం పులు మానుకోవాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మథ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయం వద్ద విలేకర్లతో మాట్లాడారు. జియ్యమ్మవలస మండలంలో ఎంపీపీ బొంగు సురేష్ చిరుద్యోగులు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తుండడం సరికాదన్నారు. ఇప్పటికైనా కక్ష సాధింపులు ఆపకపోతే పోరాటాలను ఉధృతం చేస్తామన్నారు.