ఆటోడ్రైవర్‌కు గాయాలు
ABN , Publish Date - Jul 08 , 2024 | 12:02 AM
మండలంలోని ఆరికతోట జాతీయరహదారిపై ఆదివారం జరి గిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయని ఎస్‌ఐ జ్ఞానప్రసాద్ తెలిపారు.

రామభద్రపురం:మండలంలోని ఆరికతోట జాతీయరహదారిపై ఆదివారం జరి గిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయని ఎస్‌ఐ జ్ఞానప్రసాద్ తెలిపారు. రామభద్రపురం నుంచి ఆరికతోట వెళ్తున్న ఆటోను వెనుకనుంచి విజయనగరం వైపు వెళ్తున్న కారు ఢీకొందని చెప్పారు.దీంతో ఆరికతోట గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ పొట్నూరు ప్రకాష్‌కు గాయాల య్యాయని తెలిపారు. ప్రకాష్‌ను 108లో బాడంగి ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.కేసు నమోదుచేసినట్లు తెలిపారు.