Share News

ఎట్టకేలకు బట్టికాలువలో పూడికతీత

ABN , Publish Date - Jul 08 , 2024 | 11:56 PM

భోగాపురం బట్టికాలువలో సోమవారం నిర్వహించిన పూడికతీత పనులను ఎమ్మెల్యే లోకం నాగమాధవి పరిశీలించారు.

ఎట్టకేలకు బట్టికాలువలో పూడికతీత

భోగాపురం: భోగాపురం బట్టికాలువలో సోమవారం నిర్వహించిన పూడికతీత పనులను ఎమ్మెల్యే లోకం నాగమాధవి పరిశీలించారు. బట్టికాలువను గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సగం వరకు అభివృద్ధి చేయగా, వైసీపీ ప్రభుత్వంలో ఎటు వంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఈ కాలువ నుంచే గంగిరావి చెరువుకు నీరు చేరుతుంది. ప్రస్తుతం వర్షాలు ప్రారంభం కావడం పూడికతో నిండిపోయింది. దీంతో రైతులు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా స్థానిక నాయకులు, యువత, జనసైనికులు ఇటీవల ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే ఇటీవల నిర్వహిం చిన గ్రామసభ దృష్టికి తీసుకొచ్చారు. ఈక్రమంలో పంచాయతీ నిధులు నిధుల తో పూడిక తీత పనులు ప్రారంభించారు. ఈ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. బట్టికాలువను ఏడాదిలోగా అభివృద్ధి చేస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమం లో ఈవోపీఆర్డీవో సురేష్‌, ఇన్‌చార్జి కార్యదర్శి సురేష్‌, నాయకులు వరుపుల సుధాకర్‌, పి.జగదీష్‌, పల్ల రాంబాబు, గుండపు సూర్యారావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2024 | 11:56 PM