న్యాయవాదుల కుటుంబాలకు సాయం
ABN , Publish Date - Oct 20 , 2024 | 12:23 AM
రాష్ట్రంలో ఉన్న న్యాయవాదుల కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర బార్ కౌన్సిల్ ముందుకు వచ్చిందని కొత్తవలస న్యాయవాద సంఘ అధ్యక్షురాలు డీవీఎల్ దేవి తెలిపారు.
కొత్తవలస, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో ఉన్న న్యాయవాదుల కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర బార్ కౌన్సిల్ ముందుకు వచ్చిందని కొత్తవలస న్యాయవాద సంఘ అధ్యక్షురాలు డీవీఎల్ దేవి తెలిపారు. అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందులలో ఉన్న న్యాయవాదులతో పాటు మరణించిన వారి కుటుంబాలకు సాయానికి సంబంధించి పెండింగ్‌లోనున్న దరఖాస్తులను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటోందన్నారు. దీనికి గాను రూ. 6కోట్ల10 లక్షల 36 వేలు మంజూరు చేసిందన్నారు. మృతి చెందిన 88 మంది న్యాయవాదులకు రూ.4 లక్షల చొప్పున, మరో 47 కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున అందించనున్నట్టు తెలిపారు. అనారోగ్యం కారణంగా ఆర్థిక సాయం కోరుతూ రాష్ట్ర బార్ కౌన్సిల్‌కు దరఖాస్తు చేసుకున్న 24 మంది న్యాయవాదులకు రూ.11 లక్షల50 వేలు, పదవీ విరమణ చేసిన ఆరుగురు న్యాయవాదులకు రూ.11 లక్షల 86 వేలు అందించనున్నట్టు తెలిపారు. ఈ సాయానికి మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బార్ కౌన్సిల్ కోరిందని దేవి తెలిపారు.