Share News

అట్టలే తలుపులుగా..

ABN , Publish Date - Jan 17 , 2024 | 12:14 AM

ఇది సీతంపేట ఏరియా ఆసుపత్రికి ముఖద్వారం. ప్రధాన గేటుకు తలుపులను బిగించకపోవడంతో ఇలా అట్టలను పెట్టారు.

 అట్టలే తలుపులుగా..
ప్రధాన ముఖద్వారం ద్వారానే అట్టలు ఏర్పాటు చేసిన సిబ్బంది

ఇది సీతంపేట ఏరియా ఆసుపత్రికి ముఖద్వారం. ప్రధాన గేటుకు తలుపులను బిగించకపోవడంతో ఇలా అట్టలను పెట్టారు. సుమారు రూ.20 కోట్లతో చేపడుతున్న ఏరియా ఆసుపత్రి భవన నిర్మాణం మందకొడిగా సాగుతోంది. ఎక్స్‌రే యూనిట్‌ ఎమర్జెన్సీ వార్డుకు వెళ్లే విధంగా ప్రధాన ముఖ ద్వారాన్ని ఏర్పాటు చేసినప్పటికీ.. నిధులు లేమితో ఆసుపత్రి పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. దీంతో ప్రధాన గేటుకు తలుపులను అమర్చకుండా ఇలా విడిచి పెట్టేశారు. దానిలోపల ఎక్స్‌రే యూనిట్‌, మందులు, ఫిజియోథెరపీ, వైద్యాధికారులు, రికార్డులు భద్రపరిచే గదులు ఉండడంతో రాత్రి వేళల్లో ఎవరూ అందులోకి ప్రవేశించకుండా ఇలా ముఖద్వారానికి తాత్కాలికంగా అట్టలు పెట్టారు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ..ఆసుపత్రి పనులు పూర్తవకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా మన్నారు. దీనిపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని కోరారు.

- సీతంపేట

Updated Date - Jan 17 , 2024 | 12:14 AM