Share News

కళలను ప్రోత్సహించాలి

ABN , Publish Date - Jul 28 , 2024 | 11:38 PM

కళలను ప్రోత్సహించాలని ఆంధ్రప్రదేశ్‌ కళాకారుల సంఘం సంక్షేమ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రౌతు వాసుదేవరావు కోరారు.

కళలను ప్రోత్సహించాలి

గరుగుబిల్లి: కళలను ప్రోత్సహించాలని ఆంధ్రప్రదేశ్‌ కళాకారుల సంఘం సంక్షేమ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రౌతు వాసుదేవరావు కోరారు. ఆదివారం తోట పల్లి నూతన జట్టు ట్రస్ట్‌ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్ర కళాకారుల సంఘ అధ్యక్షుడు ద్వారపురెడ్డి ధనుంజయరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావే శంలో వాసుదేవరావు మాట్లాడారు. వందేళ్ల చరిత్ర కలిగినటువంటి చింతామణి నాటకాన్ని ఆపి వేయడం అమానుషమన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సలహాదారు ద్వారపురెడ్డి రామ్మోహన్‌రావు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కె.మంగాదేవి, మిమిక్రీ శివ, రాష్ట్ర కార్యదర్శి మువ్వల వెంకటరమణ, కోశాధికారి కర్నూలు మహాలింగప్ప, అనంతపురం కుళ్లయ్యప్ప, ప్రకాశం వరప్రసాద్‌, కాకినాడ రాజబాబుతో పాటు వివిధ జిల్లాల పౌరాణిక రంగాలలో ప్రావీణ్యం ఉన్న కళాకారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 28 , 2024 | 11:38 PM