Share News

కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

ABN , Publish Date - Jun 03 , 2024 | 12:11 AM

జిల్లాలో సార్వ త్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేసిన ట్లు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్‌కుమార్‌ తెలిపారు. ఆదివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని చెప్పారు.

 కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

- ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం

- జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్‌కుమార్‌

పార్వతీపురం, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సార్వ త్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేసిన ట్లు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్‌కుమార్‌ తెలిపారు. ఆదివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని చెప్పారు. ‘ఉల్లిభద్ర ఉద్యాన కళాశాలలో జిల్లాలోని నాలుగు శాసనసభ నియోజకవ ర్గాల ఈవీఎం ఓట్ల లెక్కింపుతో సహా అరకు పార్లమెంట్‌ నియోజకవర్గానికి చెందిన పోస్టల్‌ బ్యాలెట్లు, నాలుగు శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని పార్లమెంట్‌ ఈవీఎం ఓట్లు లెక్కింపు జరుగుతుంది. ఈవీఎం ఓట్ల లెక్కింపునకు 8 కౌంటింగ్‌ హాళ్లు, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు లెక్కింపునకు ఒక కౌంటింగ్‌ హాల్‌ ఏర్పాటు చేశాం. ఈవీఎం ఓట్ల లెక్కింపునకు ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు 14 టేబుళ్లు, పార్లమెంట్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపునకు 20 టేబుళ్లు ఏర్పాటు చేశాం. పార్లమెంట్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపునకు ప్రతి టేబుల్‌ వద్ద ఒక జిల్లా స్థాయి అధికారి, సహాయ రిటర్నింగ్‌ అధికారి, ఒక గజిటెడ్‌ అధికారి, ఇతర సిబ్బంది ఉంటారు. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు వద్ద అభ్యర్థిగాని, ప్రధాన ఏజెంట్‌గాని ఉండవచ్చు. ప్రతి టేబుల్‌ వద్ద ఒక మైక్రో అబ్జర్వర్‌ ఉంటారు. రిటర్నింగ్‌ అధికారి వేదిక వద్ద జరిగే పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు వద్ద ఇద్దరు మై క్రో అబ్జర్వర్లు ఉంటారు. మొత్తం 190 మైక్రో అబ్జర్వర్లు, 181 మంది కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, 213 మంది కౌంటింగ్‌ సహాయకులను నియమించాం. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు కేంద్రాలకు వెళ్లడానికి ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశాం. ఆ మార్గంలో సీఆర్‌పీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందితో భద్రత ఉంటుంది. అరకు పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించి 21,462 పోస్టల్‌ బ్యాలెట్లు, 1165 సర్వీస్‌ ఓట్లు ఇప్పటివరకు అందాయి. 511 మంది ఎన్నికల ఏజెంట్లకు గుర్తింపుకార్డులు జారీ చేశాం. పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ రెండు రౌండ్లలో ముగుస్తుంది. ప్రతి రౌండ్‌కు రెండున్నర నుంచి మూడు గంటల సమయం పడుతుంది. పార్వతీపురం నియోజకవర్గానికి 17 రౌండ్లు, సాలూరుకు 18, కురుపాంకు 20, పాలకొండకు 21 రౌండ్ల లెక్కింపు జరుగుతుంది. లెక్కింపు సిబ్బంది తుది ర్యాండమైజేషన్‌ మంగళవారం జరుగుతుంది. ప్రథమ చికిత్స శిబిరం, అగ్నిమాపక శకటాన్ని కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఏర్పాటు చేశాం.’ అని కలెక్టర్‌ తెలిపారు.

ఎలకా్ట్రనిక్‌ పరికరాలకు అనుమతి లేదు..

కౌంటింగ్‌ కేంద్రాల్లోకి ఎటువంటి ఎలకా్ట్రనిక్‌ పరికరాలను తీసుకెళ్లేందుకు అనుమతి లేదని జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. మొబైల్‌ ఫోన్లు, కెమేరాలు, స్మార్ట్‌ వాచ్‌లు, తదితర ఎలకా్ట్రనిక్‌ పరికరాలను తీసుకురావద్దన్నారు. ఏజెంట్లు కేవలం పెన్ను, పెన్సిల్‌, 17 సి ఫారం, తెల్లకాగితం మాత్రమే తేవాలని స్పష్టం చేశారు. లెక్కింపు సమయంలో ఎన్నికల కమిషన్‌ నియమించిన ఇద్దరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు పరిశీలకులుగా హాజరుకానున్నారు.

జిల్లాలో 144 సెక్షన్‌..

జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలులో ఉందని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. కౌంటింగ్‌ అనంతరం పరిస్థి తుల రీత్యా కొనసాగింపుపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. లెక్కింపు కేంద్రం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. 158 సీసీ కెమేరాలు, రెండు డ్రోన్లతో నిరంతర నిఘా ఉంటుందన్నారు. డ్రోన్లు, ఎగిరే పరికరాలను ఈ ప్రాంతంలో ఎగురవేయకుండా నోఫ్లైజోన్‌గా ప్రకటించామన్నారు. ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ మాట్లాడుతూ.. వాహనాల పార్కింగ్‌ను కౌంటింగ్‌ కేంద్రం బయట ఏర్పాటు చేశామన్నారు. నిర్దేశిత ప్రదేశంలో వాహనాలను నిలుపుదల చేయాలన్నారు. 144 సెక్షన్‌ అమల్లో ఉందని, ఎక్కడా ఎక్కువ మంది గుమిగూడరా దని స్పష్టం చేశారు. పోలీస్‌ సూపరింటెండెంట్‌, ఏఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, 17 మంది సీఐలు, 24 మంది ఎస్‌ఐలు, 500 మంది పోలీసు సిబ్బందితో పాటు ఒక కేంద్ర బలగంతో బందోబస్తు ఉంటుందని తెలిపారు. అదనంగా మూడు కేంద్ర బలగాలు సోమవారం జిల్లాకు చేరుకుంటాయన్నారు. జిల్లాలో 3వ తేదీ రాత్రి నుంచి 5వ తేదీ ఉదయం వరకు మద్యం విక్రయాలపై నిషేధం విధించినట్లు తెలిపారు.

Updated Date - Jun 03 , 2024 | 12:11 AM