Share News

పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ

ABN , Publish Date - Feb 25 , 2024 | 12:25 AM

ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌, ఐటీడీఏ పీవో సి.విష్ణుచరణ్‌ ఆదేశించారు.

పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ

పార్వతీపురం, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌, ఐటీడీఏ పీవో సి.విష్ణుచరణ్‌ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, సిబ్బందికి శిక్షణ నిర్వహించారు. వారి విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించారు. ఎన్నికల విధుల్లో నిఘా బృందాలు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు చాలా కీలకమన్నారు. నిబంధనలు ప్రకారం పనిచేయాలని సూచించారు. ప్రజలు తమ వద్ద ఉంచుకొనే డబ్బు, బంగారం పరిమితి గురించి తెలుసుకోవాలని, ప్రలోభాలకు గురిచేసే వస్తువులు, రవాణా వంటివి అరికట్టడంలో బాధ్యతగా వ్యవహరించాలని ఇన్‌చార్జి డీఆర్వో జి.కేశవనాయుడు తెలిపారు.

Updated Date - Feb 25 , 2024 | 12:25 AM