రోగులతో ఏరియా ఆసుపత్రి కిటకిట
ABN , Publish Date - Jul 08 , 2024 | 11:49 PM
సీతంపేట ఏరియా ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతోంది. మలేరియా, జ్వరాల లక్షణాలతో అత్యధికులు ఇక్కడకు వస్తున్నారు. అయితే ఆసుపత్రిలో సరిపడా మంచాలు, వార్డులు లేకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు.

సీతంపేట: సీతంపేట ఏరియా ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతోంది. మలేరియా, జ్వరాల లక్షణాలతో అత్యధికులు ఇక్కడకు వస్తున్నారు. అయితే ఆసుపత్రిలో సరిపడా మంచాలు, వార్డులు లేకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో వైద్య స్బింది ఆసుపత్రి వరండాలో మంచాలు ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం 30 మంది వరకు చిన్నారులు జ్వరాలతో చికిత్స పొందుతున్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, మినీ గురుకులాలు రెసిడెన్షియల్ పాఠశాలలకు చెందిన గిరిజన విద్యార్థులు కూడా జ్వరాలు, ఒంటినొప్పులతో ఆసుపత్రిలో చేరారు. అయితే ఇక్కడ చిన్న పిల్లల వైద్యులు లేరు. దీంతో సాధారణ రోగులకు వైద్యం అందిస్తున్న వైద్యాధికారులే చిన్న పిల్లలకు వైద్యం అందిస్తున్నారు. రోగులు తాకిడి అధికంగా ఉండగా, అందరికీ పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందిస్తున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు తెలిపారు.