Share News

20న అరకులో ‘రా.. కదలిరా’

ABN , Publish Date - Jan 18 , 2024 | 12:19 AM

ఈనెల 20న అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీలో టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిర్వ హించనున్న రా..కదలిరా బహిరంగ సభను విజయవంతం చేయాలని నాయ కులు, కార్యకర్తలను ఎస్‌.కోట నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు చౌదరి బాబ్జి కో రారు.

20న అరకులో ‘రా.. కదలిరా’

శృంగవరపుకోట, జనవరి 17: ఈనెల 20న అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీలో టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిర్వ హించనున్న రా..కదలిరా బహిరంగ సభను విజయవంతం చేయాలని నాయ కులు, కార్యకర్తలను ఎస్‌.కోట నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు చౌదరి బాబ్జి కో రారు. బుధవారం స్థానిక టీడీపీ నేత నివాసంలో కార్యకర్తలతో సమావేశమ య్యారు. ఈ నియోజకవర్గానికి ఆనుకొని ఉన్న అరకు వ్యాలీలో బహిరంగ సభ కు రెండు వేల మంది వచ్చేలా ప్రణాళిక తయారు చేశామన్నారు. టీడీపీ ఇన్‌ చార్జి, మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యం లో ఏర్పాట్లు చేస్తున్నామ న్నారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు జీఎస్‌ నాయు డు, మాజీ ఎంపీపీ రెడ్డి వెంకన్న, నాయకులు మల్లేశ్వరరావు, కాపుగంటి శ్రీని వాసరావు, చెక్క కిరణ్‌ కుమార్‌, భీశెట్టి అరుణ, వాకాడ బాలు, కనిశెట్టి ఈశ్వరరావు, పెదగాడి రాజు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2024 | 12:19 AM