Share News

అప్రంటీస్‌ విధానం రద్దు చేయాలి: యూటీఎఫ్‌

ABN , Publish Date - Feb 12 , 2024 | 12:40 AM

ఉపాధ్యాయ నియామకాల్లో అప్రంటీస్‌ విధానం రద్దు చేయాలని యూటీఎఫ్‌ జిల్లా నేత ఎస్‌.మురళీమోహన్‌రావు ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

 అప్రంటీస్‌ విధానం రద్దు చేయాలి: యూటీఎఫ్‌

బెలగాం, ఫిబ్రవరి 11 : ఉపాధ్యాయ నియామకాల్లో అప్రంటీస్‌ విధానం రద్దు చేయాలని యూటీఎఫ్‌ జిల్లా నేత ఎస్‌.మురళీమోహన్‌రావు ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఉపాధ్యాయ వృత్తిలోకి ఆ విధానాన్ని తీసుకురావడమంటే, టీచర్లను వెట్టిచాకిరిలోకి నెట్టడమే అని పేర్కొన్నారు. సీఎం, ఎమ్మెల్యేలకు కూడా అప్రంటీస్‌ విధానం పెడతారా? అని ప్రశ్నించారు. రెండేళ్లు అప్రంటీస్‌ చేసిన తర్వాత పరిపాలన బాగుంటే కొనసాగించడం.. లేదంటే రీకాల్‌ చేస్తే బాగుంటుందన్నారు. విద్యాహక్కు ప్రకారం ఉపాధ్యాయ నియామకాలు రెగ్యులర్‌ వేతనంతో కూడినవిగా ఉండాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని ఉల్లంఘించి నియామకాలు చేపడతామనడం నియంతృత్వ పోకడకు అద్దం పడుతుందని స్పష్టం చేశారు. ఈ విధానం రద్దు చేయాలని, లేకుంటే ఉపాధ్యాయులు ఉద్యమాలకు సిద్ధమవుతారని తెలిపారు.

Updated Date - Feb 12 , 2024 | 12:40 AM