ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్‌ఎంల నియామకం
ABN , Publish Date - Mar 08 , 2024 | 12:02 AM
ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్‌ఎంల నియా మకానికి చర్యలు తీసుకుంటున్నట్టు ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్‌వో శివకుమార్ చెప్పారు.
పార్వతీపురం, ఆంధ్రజ్యోతి: ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్‌ఎంల నియా మకానికి చర్యలు తీసుకుంటున్నట్టు ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్‌వో శివకుమార్ చెప్పారు. గురువారం గిరిమిత్ర సమావేశ మందిరంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల మరణాలను నివారించేం దుకు ప్రత్యేకంగా వీరి నియామకానికి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్యులు అజయ్, రవికిరణ్, డి.రమణ కుమార్ పట్నాయక్, హెల్త్ కో-ఆర్డినేటర్ వినోద్, హెల్త్ ఎడ్యుకేటర్ శోభ పాల్గొన్నారు.