Share News

ఏపీఈఏపీ సెట్‌లో మెరిశారు

ABN , Publish Date - Jun 11 , 2024 | 11:30 PM

ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కామన్‌ ప్రవేశ పరీక్ష (ఏపీఈఏపీ)లో జిల్లాకు చెందిన విద్యార్థులు చక్కని ప్రతిభ చూపారు. ఇంజినీరింగ్‌ విభాగంలో బాలురు మంచి ర్యాంకులు సాధించగా అగ్రికల్చర్‌, ఫార్మసీలో బాలికలు ప్రతిభ చాటారు.

ఏపీఈఏపీ సెట్‌లో మెరిశారు

ఏపీఈఏపీ సెట్‌లో మెరిశారు

ఇంజనీరింగ్‌లో మంచి ర్యాంకులు సాధించిన బాలురు

అగ్రికల్చర్‌, ఫార్మసీలో ప్రతిభ చాటిన బాలికలు

కలెక్టరేట్‌, జూన్‌ 11: ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కామన్‌ ప్రవేశ పరీక్ష (ఏపీఈఏపీ)లో జిల్లాకు చెందిన విద్యార్థులు చక్కని ప్రతిభ చూపారు. ఇంజినీరింగ్‌ విభాగంలో బాలురు మంచి ర్యాంకులు సాధించగా అగ్రికల్చర్‌, ఫార్మసీలో బాలికలు ప్రతిభ చాటారు. గత నెల 16 నుంచి 23వ తేదీ వరకూ పరీక్షలు జరిగాయి. 16,17 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీకి సంబంధించిన విద్యార్థులు పరీక్షలు రాయగా 18 నుంచి 23వ తేదీ వరకూ ఇంజినీరింగ్‌ విద్యార్థులు పరీక్ష రాశారు. జిల్లా వ్యాప్తంగా ఆరు కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సులకు సంబంధించి 4,698 మంది హాజరుకాగా, ఇంజినీరింగ్‌కు సంబంధించి 12,754 మంది పరీక్ష రాశారు. రెండు కోర్సులు కలిపి మరో 47 మంది రాయగా మొత్తం 17,499 మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఇంజనీరింగ్‌లో జిల్లాలో మొదటి పది ర్యాంకులు

ఇంజినీరింగ్‌ విభాగంలో జిల్లాలో రాజాంకు చెందిన ముద్దా మణికంఠ పుధ్వీరాజుకు (11వ ర్యాంకు)మొదటి

స్థానం దక్కింది. తర్వాత ర్యాంకులు వరుసగా మెంటాడ మండలం జక్కువ గ్రామానికి చెందిన పొట్టా నిశ్వంత్‌కు 14వ ర్యాంకు వచ్చింది. గజపతినగరం మండలం పురిపెంటకు చెందిన కనకాల జశ్వంత్‌ కుమార్‌కు 29వ ర్యాంకు, చీపురుపల్లికి చెందిన మొయ్య హర్షవర్ధన్‌కు 52వ ర్యాంకు, మెంటాడ మండలం పోరాంకు చెందిన మజ్జి రిషివర్ధన్‌కు 63వ ర్యాంకు, విజయనగరానికి చెందిన కొల్లి సూర్యశశాంక్‌ 69వ ర్యాంకు, విజయనగరం కెఎల్‌ పురానికి చెందిన అల్లు హేమంత్‌కు 82వ ర్యాంకు, కొత్తవలస మండలం మంగళపాలెంకు చెందిన పొలమరశెట్టి కారుణ్యకు 91వ ర్యాంకు, విజయనగరం పట్టణంలోని పూలబాగ్‌ కాలనీకి చెందిన పిల్లా సుజన్‌ నారాయణకు 93వ ర్యాంకు, గజపతినగరం మండలం ములకలగుమడాంకు చెందిన డి.మాధవరావుకు 115వ ర్యాంకు వచ్చింది.

అగ్రికల్చర్‌, ఫార్మసీలో జిల్లాలో మొదటి పది ర్యాంకులు

అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగంలో జిల్లాలోని రాజాం చెందిన ఏనుగుతల సాయిశృతికి (60వ ర్యాంకు) ప్రథమ స్థానం దక్కింది. తర్వాత ర్యాంకులు వరుసగా విజయనగరం పట్టణంలోని రింగురోడ్డుకు చెందిన యర్నాగుల ప్రణబ్‌కు 93వ ర్యాంకు, బొబ్బిలికి చెందిన డోకుల శరణ్యకు 126, విజయనగరంకు చెందిన అల్లు కావ్యంజలి 127, బొబ్బిలి మండలం పక్కికి చెందిన శంబంగి శరణ్యకు 138, బాడంగి మండలం ముగడ గ్రామానికి చెందిన గుల్లుపల్లి దీవెన్‌కు 169, కొత్తవలస చెందిన దుడ్డు యశ్వసి ఈశ్వరసాయి 183, బాడంగి మండలం గజరాయవలస గ్రామానికి చెందిన బొత్స ప్రహర్షితకు 196, ఎల్‌.కోటకు చెందిన యడ్ల మురళికి 203, కొత్తవలసకు చెందిన పులిబండి ప్రేరణకు 215వ ర్యాంకు వచ్చింది.

------------

Updated Date - Jun 11 , 2024 | 11:30 PM