Share News

కొత్తవలస మీదుగా మరో కెనాల్‌

ABN , Publish Date - Jan 29 , 2024 | 12:24 AM

కొత్తవలస మండలానికి మరో కాలువ రాబోతోంది. మహానది- గోదావరి ఇంటర్‌లింకింగ్‌ ప్రాజెక్టు తెరపైకి వస్తోంది. ఇప్పటికే రెండు జాతీయ రహదారులు, పోలవరం ఎడమ కాలువ, రెండు గ్యాస్‌ పైప్‌ లైన్‌లు, మరో రైల్వేలైన్‌ ఏర్పాటుకు భూ సేకరణ ప్రక్రియ జరుగుతోంది. తాజాగా ఇంకో ప్రాజెక్టు కోసం భూ సేకరణకు అధికారులు దిగనున్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్‌ వాటర్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ(ఎన్‌డబ్యుడీఏ) ద్వారా భూసేకరణ సర్వే చేస్తున్నారు.

  కొత్తవలస మీదుగా మరో కెనాల్‌
తుమ్మికాపల్లి జూట్‌ మిల్లు వద్ద పిల్లర్‌ వేయడానికి గొయ్యి తవ్వుతున్న దృశ్యం

కొత్తవలస మీదుగా మరో కెనాల్‌

భూసేకరణకు సహకరించాలని ఉత్తర్వులు

తెరపైకి మహానది- గోదావరి ఇంటర్‌ లింకింగ్‌ ప్రాజెక్టు

కొత్తవలస, జనవరి 28 : కొత్తవలస మండలానికి మరో కాలువ రాబోతోంది. మహానది- గోదావరి ఇంటర్‌లింకింగ్‌ ప్రాజెక్టు తెరపైకి వస్తోంది. ఇప్పటికే రెండు జాతీయ రహదారులు, పోలవరం ఎడమ కాలువ, రెండు గ్యాస్‌ పైప్‌ లైన్‌లు, మరో రైల్వేలైన్‌ ఏర్పాటుకు భూ సేకరణ ప్రక్రియ జరుగుతోంది. తాజాగా ఇంకో ప్రాజెక్టు కోసం భూ సేకరణకు అధికారులు దిగనున్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్‌ వాటర్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ(ఎన్‌డబ్యుడీఏ) ద్వారా భూసేకరణ సర్వే చేస్తున్నారు.

రాజమండ్రి నుంచి అస్సాం రాష్ట్రం వరకు నదులను అనుసంధానం చేసే ప్రక్రియలో భాగంగా కొత్త ప్రాజెక్టును చేపట్టారు. మహానది- గోదావరి ఇంటర్‌ లింకింగ్‌ పేరుతో మొదలు పెట్టారు. కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానం చేయడానికి తొలుత సర్వే చేస్తున్నారు. సర్వే పనులకు విజయనగరం, విశాఖపట్టణం, శ్రీకాకుళం జిల్లా ప్రజలు సహకరించేలా చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్‌లకు ఉత్తర్వులను జారీ అయ్యాయి. కొత్తవలస మండలంలోని దెందేరు, ఒమ్మికాపల్లి పంచాయతీ సీతంపేటలో నున్న ఉమా జూట్‌ మిల్లు, దత్తి గ్రామాలు మీదుగా సర్వే పనులను మొదలు పెట్టారు. సర్వే చేసేందుకు సెంటర్‌ పాయింట్‌లను నిర్ణయిస్తున్నారు. సుమారు 500 మీటర్ల వెడల్పులో నదుల అనుసంధానం కాలువ ఉంటుందని సమాచారం.

ఇప్పటికే పలు గ్రామాల నుంచి వేస్తున్న రెండు జాతీయ రహదారులు, పోలవర ం కాలువ, రెండు గ్యాస్‌ పైప్‌లైన్లు, మరో రైల్వే లైన్‌ కోసం మండలంలోని రైతులు దాదాపు 80 శాతం మంది తమ భూములును కోల్పోయారు. తాజాగా ఈ ప్రాజెక్టు కూడా కొత్తవలస మండలంలో నుంచే వెళ్లడంతో రైతులు టెన్షన్‌ పడుతున్నారు. ప్రాజెక్టులన్నీ ఈ మండలం నుంచే ఎందుకు వెళ్తున్నాయి? మరే మండలాలు లేవా? అని ప్రశ్నిస్తున్నారు.

Updated Date - Jan 29 , 2024 | 12:24 AM