Share News

ఆంధ్రకేసరి ఇక్కడి నుంచే!

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:47 AM

‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులును ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా అందించిన చరిత్ర శృంగవరపుకోట నియోజకవర్గానిది. ఉ మ్మడి మద్రాస్‌ రాష్ట్రంలో 1952లో ఈ నియోజకవర్గం ఏర్పాటైంది. అ ప్పట్లో జరిగిన ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా సోషలిస్టు పార్టీకి చెందిన చాగంటి వెంకట సోమయాజులు ఎమ్మెల్యేగా ఎన్నిక య్యారు.

ఆంధ్రకేసరి ఇక్కడి నుంచే!
శృంగవరపుకోట పట్టణం

- ఎస్‌.కోట నుంచి టంగుటూరి ఎన్నిక

- తొలి సీఎంగా బాధ్యతలు

- ప్రజా సోషలిస్టు పార్టీ తరఫున ఏకగ్రీవం

- 1983 నుంచి టీడీపీకి కంచుకోట

- 25 ఏళ్లపాటు గిరిజనుల ప్రాతినిథ్యం

(శృంగవరపుకోట)

‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులును ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా అందించిన చరిత్ర శృంగవరపుకోట నియోజకవర్గానిది. ఉ మ్మడి మద్రాస్‌ రాష్ట్రంలో 1952లో ఈ నియోజకవర్గం ఏర్పాటైంది. అ ప్పట్లో జరిగిన ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా సోషలిస్టు పార్టీకి చెందిన చాగంటి వెంకట సోమయాజులు ఎమ్మెల్యేగా ఎన్నిక య్యారు. ప్రత్యేక రాష్ట్రం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసిన సంగతి తెలిసిందే. 1953లో ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించింది. దీనికి తొలి ముఖ్యమంత్రి గా టంగుటూరి ప్రకాశం పంతులు నియమితులయ్యారు. ఆయనను శాసన సభ్యుడిగా ఎన్నుకొనేందుకు వీలుగా ఈ నియోజకవర్గానికి అప్పటికే ప్రాతినిధ్యం వహిస్తున్న సీవీ సో మయాజులు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఆంధ్రకే సరి తాను స్థాపించిన ప్రజా సోషలిస్టు పార్టీ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండేళ్ల పాటు ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించి.. ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.

టీడీపీకి కంచుకోట

ఈ నియోజకవర్గం ఏర్పడిన తరువాత ఇంత వరకు ఏడుసార్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఐదుసార్లు కాంగ్రెస్‌ పార్టీ, నాలుగుసార్లు సోషలిస్టు పార్టీ, ఒకసారి ఇండిపెండెంట్‌, ఒకసారి వైసీపీ ఈ నియోజకవర్గంలో జెండా ఎగరవేశాయి. 1983లో దివంగత ఎన్టీఆర్‌ తె లుగుదేశం పార్టీని స్థాపించారు. అప్పటి నుం చి ఆ పార్టీ అభ్యర్థి లగుడు బారికి దుక్కు 1994 వరకు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా రు. 1999లో శోభా హైమావతి, 2009, 2014లో కోళ్ల లలిత కుమారి టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్ర ప్రభావంతో 2004లో కాంగ్రెస్‌ అభ్యర్థి కుంభా రవిబాబు.. 2019లో వైసీపీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు ఈ స్థానాన్ని దక్కించుకున్నారు. టీ డీపీకి పట్టున్న నియోజకవర్గంతో పాటు కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగానే అత్యధిక పర్యాయాలు ఇక్క డ ప్రజలు ఓట్లేసినట్లు గణంకాలు చెబుతున్నాయి.

అత్యధికం.. అత్యల్పం టీడీపీవే..

శృంగవరపుకోట నియోజకవర్గ ఆవిర్భావం నుంచి అత్యధిక, అత్యల్ప మెజారిటీతో గెలు పొందినది టీడీపీ అభ్యర్థులే. 2014లో టీడీపీ నుంచి గెలుపొందిన కోళ్ల లలిత కుమారికి 28,572 ఓట్ల మెజారిటీ వ చ్చింది. ఇదే పార్టీకి చెందిన ఎల్‌.బి. దుక్కుకు 1983 ఎన్నికల్లో 27,185, 1985లో 28,385 ఓట్ల మెజారిటీ వచ్చింది. 1999 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి శోభా హైమావతి అత్యల్పంగా 678 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

ఇద్దరు స్థానికేతరులు

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత రెండుదఫాలు మాత్రమే ఓటమి చవిచూసింది. ఓసారి కాంగ్రెస్‌, మరోసారి వైసీపీ ఇక్కడ గెలిచా యి. ఈ పార్టీల నుంచి నిలబడిన ఇద్దరు అభ్యర్థులూ స్థానికేతరులే. 2004లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలుపొందిన కుంభా రవిబాబు గుంటూరుకు చెందిన వారు. ఆంధ్ర యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉన్న ఆయనకు టిక్కెట్‌ను కేటాయించారు. నియోజకవర్గ పునర్విభజన అనంతరం జనరల్‌గా మారిన ఈ నియోజకవర్గంలో 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలుపొందిన కడుబండి శ్రీనివాసరావు గజపతినగరం నియోజకవర్గ పరిధిలోని దత్తిరాజేరు మండలానికి చెందినవారు.

ఇద్దరే ఏకగ్రీవవీరులు

ఆంరఽధకేసరి టంగుటూరి ప్రకాశం పంతు లు, గుజ్జల ధర్మానాయుడు (జీడీ నాయుడు) ఈ నియోజకవర్గంలో ఏకగ్రీవ వీరులుగా పేరొందారు. 1953లో జరిగిన ఎన్నికలో టంగుటూరి ప్రకాశం పంతులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1960లో గుజ్జల ధర్మానాయుడు ఏకగ్రీ వంగానే ఎన్నికయ్యారు. ఈ ఇద్దరూ చెరో రెండేళ్లు మాత్రమే శాసన సభకు ప్రాత నిధ్యం వహించడం విశేషం. 1962లో మధ్యంతర ఎన్నికలు రావడంతో గుజ్జల ధర్మానాయుడు తిరిగి పోటీ చేయాల్సి వచ్చింది.

1955 నుంచి 1960 వరకు ఇద్దరు ఎమ్మెల్యేలు

విజయనగరం జిల్లా ఆవిర్భవానికి ముందు ఈ నియోజకవర్గం విశాఖపట్టణం జిల్లాలో ఉండే ది. ఆ సమయంలో ప్రస్తుత అల్లూరి సీతారామ రాజు జిల్లా అరకు నుంచి విజయనగరం జిల్లా పరిధిలోని కొత్తవలస వరకు ఈ నియోజకవర్గం విస్తరించి ఉండేది. దీంతో 1955 నుంచి 1960 వరకు ద్విసభలను నిర్వహించారు. గిరిజనులకు ఒకటి, గిరిజనేతరులకు మరొకటి ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో గిరిజనులకు ప్రాతినిధ్యం వహిం చేందుకు ప్రజా స్వతంత్ర పార్టీ తరఫున గుజ్జల రామునాయుడు, జాతీయ కాంగ్రెస్‌ పార్టీ తరపున కె.వీరన్న పడాల్‌ పోటీ పడ్డారు. గుజ్జల రామునా యుడు విజయం సాధించారు. గిరిజనేతరులకు ప్రాతినిధ్యం వహించేందుకు ప్రజా స్వతంత్ర పార్టీ తరఫున చాగంటి వెంకట సోమయాజులు, స్వతంత్ర అభ్యర్థిగా జీవీ అప్పారావులు బరిలోకి దిగారు. చాగంటి వెంకట సోమయాజులు విజయం సాధించారు.

ఎస్‌.కోటలో ఎమెల్యేలు ఇలా..

- 1952లో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో సోషలిస్టు పార్టీకి చెందిన సీవీ సోమయాజులు కాంగ్రెస్‌ అభ్యర్థి టి.వెంకట రామారావుపై 11,688 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

- 1953లో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజా సోషలిస్టు పార్టీ అభ్యర్థి టంగుటూరి ప్రకాశం పంతులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

- 1955లో ప్రజా సోషలిస్టు పార్టీ అభ్యర్థి సీవీ సోమయాజులు స్వతంత్ర అభ్యర్థి జీబీ అప్పారావుపై 5,468 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

- 1960లో కాంగ్రెస్‌ అభ్యర్ధి జీడీ నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

- 1962లో కాంగ్రెస్‌ అభ్యర్థి జీడీ నాయుడు స్వతంత్ర అభ్యర్థి టి.రాములుపై 8,908 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

- 1967లో స్వతంత్ర అభ్యర్థి కోళ్ల అప్పలనాయుడు... కాంగ్రెస్‌ అభ్యర్థి కె.పద్మనాభరాజుపై 2,573 ఓట్లతో విజయం సాధించారు.

- 1972లో కాంగ్రెస్‌ అభ్యర్థి కె.పద్మనాభరాజు స్వతంత్ర అభ్యర్థి కోళ్ల అప్పల నాయుడుపై 13,900 ఓట్ల అధిక్యంతో గెలిచారు.

- 1978లో కాంగ్రెస్‌ అభ్యర్థి దూరి సన్యాసిదొర... స్వతంత్ర అభ్యర్థి బాలరాజుపై 5,363 ఓట్ల తేడాతో గెలుపొందారు.

- 1983లో తెలుగుదేశం అభ్యర్థి ఎల్‌.బి దుక్కు కాంగ్రెస్‌ అభ్యర్థి వెన్నెపూరి గంగన్న దొరపై 27,185 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.

- 1985లో టీడీపీ అభ్యర్థి ఎల్‌.బి దుక్కు కాంగ్రెస్‌ అభ్యర్థి దూరు గంగన్నదొరపై 28,385 ఓట్ల మెజారిటీ సాధించారు.

- 1989లో టీడీపీ అభ్యర్థి ఎల్‌.బి దుక్కు కాంగ్రెస్‌ అభ్యర్థి ఎస్‌.రామచంద్రరావుపై 6,746 ఓట్ల తేడాతో గెలుపొందారు.

- 1994లో టీడీపీ అభ్యర్థి ఎల్‌.బి దుక్కు కాంగ్రెస్‌ అభ్యర్థి శెట్టి గంగాధర స్వామిపై 19,080 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

- 1999లో టీడీపీ అభ్యర్థి శోభా హైమావతి కాంగ్రెస్‌ అభ్యర్థి శెట్టి గంగాధర స్వామిపై 678 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

- 2004లో కాంగ్రెస్‌ అభ్యర్థి కుంభా రవిబాబు... టీడీపీ అభ్యర్థి శోభా హైమావతిపై 5,802 ఓట్ల మెజారిటీ సాధించారు.

- 2009లో టీడీపీ అభ్యర్థి కోళ్ల లలిత కుమారి.. కాంగ్రెస్‌ అభ్యర్థి అల్లుకేశవ వెంకట జోగినాయుడుపై 3,440 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

- 2014లో టీడీపీ అభ్యర్థి కోళ్ల లలిత కుమారి వైసీపీ అభ్యర్థి రొంగలి జగన్నాఽథంపై 28,572 ఓట్ల తేడాతో గెలుపొందారు..

- 2019లో వైసీపీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు.. టీడీపీ అభ్యర్థి కోళ్ల లలిత కుమారిపై 11,246 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

నియోజకవర్గం: శృంగవరపుకోట

మండలాలు: శృంగవరపుకోట, వేపాడ, లక్కవరపుకోట,కొత్తవలస, జామి (సగం గ్రామాలు)

ప్రధాన పట్టణాలు: శృంగవరపుకోట, కొత్తవలస

ఓటర్లు ఇలా

మొత్తం ఓటర్లు: 2,20,309

పురుషులు: 1,07,188

మహిళలు: 1,13,117

ఇతరులు: 4

Updated Date - Apr 25 , 2024 | 12:47 AM