Share News

మరువలేని సంవత్సరం

ABN , Publish Date - Feb 29 , 2024 | 11:43 PM

లీపు సంవత్సరం.. నాలుగేళ్లకు ఒకసారి వస్తుంది. ఏటా ఫిబ్రవరి నెల 28 రోజులు ఉండగా, లీపు సంవత్సరంలో 29 రోజులు ఉంటుంది.

మరువలేని సంవత్సరం

- లీపు సంవత్సరం రోజు పలువురి శిశువుల జననం

- ప్రత్యేక రోజు కావడంతో తల్లిదండ్రుల్లో హర్షం

విజయనగరం రింగురోడ్డు, ఫిబ్రవరి 29: లీపు సంవత్సరం.. నాలుగేళ్లకు ఒకసారి వస్తుంది. ఏటా ఫిబ్రవరి నెల 28 రోజులు ఉండగా, లీపు సంవత్సరంలో 29 రోజులు ఉంటుంది. అంటే లీపు సంవత్సరంలో పుట్టిన వారు తమ పుట్టిన రోజుని జరుపుకోవాలంటే నాలుగేళ్లు ఆగాల్సిందే. నాలుగేళ్లకు ఒకసారి పుట్టిన రోజు అనేది పక్కన పెడితే, ఇటువంటి ప్రత్యేకమైన రోజున పిల్లలు పుట్టడంపై వారి తల్లిదండ్రులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గురువారం విజయనగరం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పదుల సంఖ్యలో జననాలు నమోదయ్యాయి. విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఐదుగురు శిశువులు జన్మించారు. లీపు సంవత్సరం రోజున పిల్లలు పుట్టడంతో ఆయా ఆసుపత్రుల్లో పండుగ వాతావరణం నెలకొంది. విజయనగరం ఘోషాసుపత్రిలో మెరకముడిదాం మండ లం ఎం.శబరీశ్వరీ గురువారం ఉదయం 6.30 ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో తల్లి భావోద్వేగానికి గురైంది. ఎంతో ప్రత్యేకమైన రోజు పండంటి ఆడ శిశువు పుట్టినందుకు ఆనందంగా ఉందని శబరీశ్వరీ తెలిపింది.

Updated Date - Feb 29 , 2024 | 11:43 PM