చింతచెట్టుపై నుంచి పడి వృద్ధుడి మృతి
ABN , Publish Date - Apr 03 , 2024 | 12:14 AM
మండలంలోని పెదఖండేపల్లి గ్రామానికి చెందిన తైనాన దేముడు(74) చింతచెట్టుపై నుంచి జారిపడి మరణించాడు.

శృంగవరపుకోట రూరల్, ఏప్రిల్ 2: మండలంలోని పెదఖండేపల్లి గ్రామానికి చెందిన తైనాన దేముడు(74) చింతచెట్టుపై నుంచి జారిపడి మరణించాడు. ఘటనకు సంబందించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దేముడు గ్రామంలో స్థానికంగా ఉన్న చింతచెట్టుపై చింతకాయలు దులిపేందుకు ఉదయం 9గంటలకు చెట్టు ఎక్కాడు. అయితే పదిన్నర సమయంలో చెట్టుపైనుంచి జారిపడ్డాడు. వెంటనే స్థానికులు ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించారు. ఇక్కడ పరిస్థితి విషమంగా ఉండటంతో విజయనగరం రిఫర్‌చేశారు. అక్కడకు కుటుంబసభ్యులు తీసుకెళ్లేసరికి మృతిచెందినట్లు నిర్దారించారు. ఎస్.కోట పోలీసులు కేసు నమోదు చేశారు.