Share News

ఘనంగా అమ్మవారి జాతరలు

ABN , Publish Date - Mar 27 , 2024 | 12:25 AM

మండలంలోని భోగాపురం గ్రామంలో కనకదుర్గమ్మ, పోలిపల్లి గ్రామంలో పైడితల్లమ్మ జాతరలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా అమ్మవారి జాతరలు

భోగాపురం: మండలంలోని భోగాపురం గ్రామంలో కనకదుర్గమ్మ, పోలిపల్లి గ్రామంలో పైడితల్లమ్మ జాతరలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ ఆలయాల వద్ద వేకువజాము నుంచే భక్తులు బారులు తీరారు. భక్తులకు టీడీపీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు, టీడీపీ మండల అధ్యక్షుడు కర్రోతు సత్యనారాయణ అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, నెల్లిమర్ల నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి లోకం నాగమాధవి, తదితర నాయకులు అమ్మవార్లను దర్శించుకున్నారు. సీఐ ఎ.రవికుమార్‌, ఎస్‌ఐలు పి.సూర్యకుమారి, డి.తాతారావు, పోలీస్‌ సిబ్బంది ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటుచేశారు.

Updated Date - Mar 27 , 2024 | 12:25 AM