Share News

అమిత్‌షా క్షమాపణ చెప్పాలి

ABN , Publish Date - Dec 22 , 2024 | 12:19 AM

రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ను అవమానపరిచేలా మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా క్షమాపణ చెప్పాలని కుల వివక్ష పోరాట సమితి సభ్యులు కోరారు.

 అమిత్‌షా క్షమాపణ చెప్పాలి
నిరసన తెలుపుతున్న కేవీపీఎస్‌, సీపీఎం నాయకులు

కొత్తవలస, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ను అవమానపరిచేలా మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా క్షమాపణ చెప్పాలని కుల వివక్ష పోరాట సమితి సభ్యులు కోరారు. ఈమేరకు శనివారం ఉత్తరాపల్లి పంచాయతీ గాంధీనగర్‌ ఎస్సీ కాలనీలోగల అంబేడ్కర్‌ విగ్రహం వద్ద సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు గాడి అప్పారావు, కేవీపీఎస్‌ కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో కేవీపీఎస్‌ నాయకులు వంక ఆదినారాయణ, పీవీ సూర్యనారాయణ, బండసూరిబాబు, గాడిసోని, పావాడ మణి పావాడ సునీత పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2024 | 12:19 AM