Share News

జాయింట్‌ కలెక్టర్‌గా అంబేడ్కర్‌

ABN , Publish Date - Jan 28 , 2024 | 10:46 PM

జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ నియమితులయ్యారు.

 జాయింట్‌ కలెక్టర్‌గా అంబేడ్కర్‌

పార్వతీపురం, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం జాయింట్‌ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆర్‌.గోవిందరావుకు సర్వే సెటిల్‌మెంట్‌ అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ అదనపు డైరెక్టర్‌గా బదిలీ అయింది. అంబేడ్కర్‌ గతంలో పార్వతీపురం ఆర్డీవోగా, పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. త్వరలోనే జాయింట్‌ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

Updated Date - Jan 28 , 2024 | 10:46 PM