Share News

సీతంపేట ఏరియా ఆసుపత్రిలో సదరం సేవలు

ABN , Publish Date - Oct 17 , 2024 | 12:36 AM

సీతంపేట ఏరియా ఆసుపత్రిలో వచ్చే నెల నుంచి దివ్యాంగులకు సదరం సేవలు అందనున్నట్లు ఏరియా ఆసుపత్రి సూపరెండెంట్‌ బి.శ్రీనివాసరావు తెలిపారు.

 సీతంపేట ఏరియా ఆసుపత్రిలో సదరం సేవలు

సీతంపేట రూరల్‌,అక్టోబర్‌ 16(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏరియా ఆసుపత్రిలో వచ్చే నెల నుంచి దివ్యాంగులకు సదరం సేవలు అందనున్నట్లు ఏరియా ఆసుపత్రి సూపరెండెంట్‌ బి.శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ.. ఇకపై గిరిజనులు సదరం శిబిరాల కోసం పాలకొండ వరకు వెళ్లనవసరం లేదన్నారు. సీతంపేట ఏరియా ఆసుపత్రిలోనే సేవలు అం దుబాటులోకి రానున్నట్లు చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలిచ్చిందన్నారు. అంతేగాకుండా ఆసుపత్రికి రెండు ఎక్స్‌రే యూనిట్లు కూడా మంజూరు చేసినట్లు వెల్లడించారు.ఆయన వెంట వైద్యాధికారులు రాజేష్‌, శ్రీనివాసరావులు ఉన్నారు.

Updated Date - Oct 17 , 2024 | 12:36 AM