Share News

ఏజెంట్లు కీలకం

ABN , Publish Date - Jun 03 , 2024 | 12:13 AM

ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎన్నికల ఏజెంట్ల పాత్ర ఎంతో కీలకం. వీరు ఓట్ల లెక్కింపు పూర్తి అవగాహనతో ఉండాలి.

ఏజెంట్లు కీలకం

- కౌంటింగ్‌ నిబంధనలు తెలియకుంటే కష్టమే

- ఓట్ల లెక్కింపులో ప్రతిక్షణం కనిపెట్టుకుని ఉండాల్సిందే

కొమరాడ: ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎన్నికల ఏజెంట్ల పాత్ర ఎంతో కీలకం. వీరు ఓట్ల లెక్కింపు పూర్తి అవగాహనతో ఉండాలి. ఏ మాత్రం సరిగ్గా వ్యవహరించకపోయినా అభ్య ర్థుల గెలుపోటములు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల నిబంధనలు ఏం చెబుతున్నాయి? లెక్కింపులో ఏమైనా సందేహాలు, అనుమానాలు వస్తే ఏం చేయాలి? అధికారులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తే ఎలా వ్యవహరించాలి? తదితర అంశాలపై పూర్తి స్పష్టత ఉండాలి. అందుకే పార్టీలు కూడా ఈసారి ఏజెంట్ల నియామకంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాయి. వారికి ప్రత్యేక తర్ఫీదు ఇచ్చాయి.

అవగాహన అవసరం

ఓట్ల లెక్కింపు ఫారం-17పీ పార్ట్‌-2 కీలకమైనది. ప్రతి కౌంటింగ్‌ ఏజెంట్‌, సహాయ పరిశీలకులు దీనిపై అవగాహన కలిగి ఉండాలి. కంట్రోల్‌ యూనిట్‌లో నమోదైన మొత్తం ఓట్లు ఈ ఫారం-17సీలోనే పొందుపరిచి మొత్తం ఓట్లు సరిపోల్చి చూడాలి. అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గ నెంబరు పోలింగ్‌ కేంద్రం పేరు ఆ పోలింగ్‌ కేంద్రం వినియోగించిన కంట్రోల్‌ యూనిట్‌ బ్యాలెట్‌ యూనిట్లు గుర్తింపు నెంబరును ఆ ఫారంలో నమోదు చేస్తారు. ఆ పోలింగ్‌ కేంద్రం పరిధిలో ఓటర్లు సంఖ్య, ఓటు వేయడానికి వచ్చిన వారి సంఖ్య, ఓటింగ్‌ యంత్రంలో నమోదైన మొత్తం ఓట్లు సంఖ్య ఫారం-17సీలో ఉంటాయి. టెండర్‌ బ్యాలెట్లు సరఫరా చేసిన పేర్లు షీల్డ్‌ (ఓటరుకు పోలింగ్‌ కేంద్రంలో ఇచ్చే రెండు రంగులు స్లిప్‌లు) సీరియల్‌ నెంబర్లు ఎన్ని పేపర్లు వినియోగించారు, వినియోగించని పేపర్లు సీల్డ్‌ ఎన్ని తిరిగి రిటర్నింగ్‌ అధికారికి వెళ్లాయి, పాడైన పేపర్‌ సీల్డ్‌ సీరియల్‌ నెంబర్లు వివరాలు ఇందులో ఉంటాయి.

టాంపరింగ్‌ జరిగితే..

- కంట్రోల్‌ యూనిట్‌ టేబుల్‌పైకి రాగానే అభ్యర్థి సీలింగ్‌ సెక్షన్‌ సక్రమంగా ఉందో లేదో కౌంటింగ్‌ ఏజెంట్లు చూసుకోవాలి.

- రిజల్ట్స్‌ సెక్షన్‌పై స్ర్కిప్ట్‌ సీల్డ్‌ గ్రీన్‌ పేపరు సీల్డ్‌ సక్రమంగా ఉన్నాయో లేదో చూడాలి.

- సీరియల్‌ నెంబర్‌ ఫారం-17సీలో నమోదు చేసినవి ఉండాలి.

- కంట్రోల్‌ యూనిట్‌ పేపర్‌ సీల్డ్‌ అడ్రాస్‌ ట్యాగ్‌లను టాంపరింగ్‌ జరిగాయని తెలిస్తే పరిశీలకులు ఆ విషయాన్ని రిటర్నింగ్‌ అధికారి దృష్టికి తీసుకువెళ్లాలి. టాంపింగ్‌ జరగని కంట్రోల్‌ యూనిట్లను మాత్రమే లెక్కించాలి.

- ఒకవేళ కంట్రోల్‌ యూనిట్‌ ఆన్‌ కాకుంటే ఆర్‌వోకు తెలియజేయాలి. ఆయన సరిచేస్తారు. అప్పటికీ పనిచేయకపోతే పక్కకు తీసుకువెళ్లి కంట్రోల్‌ యూనిట్లుకు సంబంధించిన వీవీ ప్యాడ్‌ స్లిప్పులను కౌంటింగ్‌ చేయాల్సి ఉంటుంది.

- ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు ఫలితాలు సంబంధించి వేర్వేరుగా కౌంటింగ్‌ హాల్స్‌ ఉంటాయి. వారికి కేటాయించిన టేబుల్స్‌ వద్ద మాత్రమే కూర్చోవాలి. అటు ఇటు తిరగరాదు. వేరే టేబుల్‌ వద్దకు వెళ్లి కూర్చోరాదు. ఫలితాలు వెల్లడి సమయంలో అభ్యర్ధి వివరాలు సహా అన్నీ రాసుకోవాలి. అన్ని ఫలితాలను కూడా కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌ కూడా నమోదు చేస్తారు.

Updated Date - Jun 03 , 2024 | 12:13 AM