Share News

అదనపు రెసిడెన్షియల్‌ కళాశాలలు ప్రారంభించాలి

ABN , Publish Date - May 23 , 2024 | 11:38 PM

ఆదివాసీ ప్రాంతాల్లో అదనపు రెసిడెన్షియల్‌ కళాశాలలు ప్రారంభించాలని ట్రైబుల్‌ రైట్స్‌ ఫోరం రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు రొబ్బా లోవరాజు, ఇంటికుప్పల రామకృష్ణ కోరారు.

 అదనపు రెసిడెన్షియల్‌ కళాశాలలు ప్రారంభించాలి

గుమ్మలక్ష్మీపురం: ఆదివాసీ ప్రాంతాల్లో అదనపు రెసిడెన్షియల్‌ కళాశాలలు ప్రారంభించాలని ట్రైబుల్‌ రైట్స్‌ ఫోరం రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు రొబ్బా లోవరాజు, ఇంటికుప్పల రామకృష్ణ కోరారు. వారు గురువారం స్థానిక విలేకర్లతో మాట్లాడారు. పదో తరగతి పాసైన ప్రతి ఆదివాసీ బిడ్డకు కూడా కళాశాలల్లో సీటు కేటాయించేటట్టు రాష్ట్రంలోని గిరిజన విభాగంలో ఉన్న ఉన్నత స్థాయి అధికారులు దృష్టి సారించాలన్నారు. గతంలో ఎప్పుడో 30 సంవత్సరాల కిందట జనాభా ప్రాతిపదికన ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసీలు ఉన్నత చదువులు చదవాలనే ఉద్దేశంతో కొన్ని కళాశా లలు స్థాపించారని చెప్పారు. ప్రస్తుతం ఉన్నత చదువుల వైపు ఆదివాసీలు దృష్టి పెడుతున్న క్రమంలో ప్రతి ఆదివాసీ బిడ్డకూ, పదో తరగతి పాసైన ప్రతిఒక్కరికీ సీట్లు కేటాయించినట్టు చూడాలని కోరారు. అదనపు కళాశాలలను కూడా వెంటనే ప్రారంభించాలని వారు డిమాండ్‌ చేశారు.

Updated Date - May 23 , 2024 | 11:38 PM